యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను దానయ్య నిర్మించబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు హడావుడి మామూలుగా జరగలేదు. రాధేశ్యామ్ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం రాజా డీలక్స్ అంటూ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ అంటూ జరిగిన ప్రచారం తోనే అందరిలో ఆసక్తి పెరిగి పోయింది. అయితే రాధేశ్యామ్ సినిమా ఫలితం ప్రభావమో లేదా మరేంటో కాని రాజా డీలక్స్ గురించిన చర్చ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా పక్కాగా ఉంటుంది.. కాని కాస్త సమయం పట్టే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్.. సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి. ఆది పురుష్ షూటింగ్ పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరో వైపు సలార్ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రాజెక్ట్ కే ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట.
రాధేశ్యామ్ సినిమా విడుదల తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తిరిగి షూటింగ్ ల్లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను మొదలు పెట్టే అవకాశం లేదట.
షూటింగ్ లో కొన్నాళ్ల క్రితం గాయ పడ్డ ప్రభాస్ మళ్లీ కోలుకుంటున్నాడు. ఈ సమయంలో స్పీడ్ గా షూటింగ్స్ చేయకుండా మెల్ల మెల్లగానే షూటింగ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తీసుకున్న నిర్ణయం తో రాజా డీలక్స్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు మాత్రం పునః ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.