టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా సమయంలో తేజస్విని ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే దిల్ రాజు.. తేజస్విని దంపతులకు బాబు అన్వై రెడ్డి జన్మించాడు. ఇన్నాళ్లు మీడియా కంట పడని అన్వై రెడ్డి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. దిల్ రాజు తన కొడుకు తల నీలాలు ఇచ్చిన తర్వాత స్వామి వారిని దర్శించుకుని రంగ నాయకుల వేద మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు.
దర్శనం తర్వాత మాడ వీధుల్లో దిల్ రాజు కుటుంబ సభ్యులు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మీడియా వారు మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఫొటో గ్రాఫర్స్ ఇలా ఫొటోలు తీశారు. దిల్ రాజు తన కొడుకు అన్వై రెడ్డిని ఎత్తుకున్నారు. మొదటి సారి వారసుడితో దిల్ రాజు కనిపించడంతో ఫొటోలు వైరల్ అవుతన్నాయి.
అన్వై రెడ్డి చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్వై రెడ్డిని చూస్తూ ఉంటే తండ్రి మాదిరిగా నిర్మాతగా కాకుండా హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోందని అంటున్నారు.
ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే ఇటీవలే బలగం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో వైపు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వందల కోట్ల బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా వరుసగా దిల్ రాజు నిర్మిస్తూ వస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.