స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత అంతకుమించి విజయాన్ని అందుకోవాలని సెకండ్ పార్ట్ తో సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఏడు వందల కోట్ల వరకు అందుకునే అవకాశం ఉన్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లుఅర్జున్ ఫోకస్ మొత్తం కూడా పుష్ప పైనే ఉంది.
అయితే అంతకుముందు ఐకాన్ సినిమా కూడా చేస్తాడు అని అనుకుంటే ఇంతవరకూ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అసలు ఆ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానం కూడా అభిమానుల్లో ఉంది.
వకీల్ సాబ్ సినిమాతో పర్వాలేదనిపించిన వేణు శ్రీరామ్ మళ్లీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమాను భారీ స్థాయిలోనే తెరకెక్కించాలని అనుకున్నాడు.
అల్లు అర్జున్ కు కూడా ఆ కథ నచ్చడంతో సరికొత్త మేక్ఓవర్ కు కూడా సిద్ధమయ్యాడు. కానీ మధ్యలో పుష్ప సినిమా అతని ఆలోచన విధానాన్ని మార్చేసింది. పాన్ ఇండియా మార్కెట్లో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తరువాత రాబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని ఫిక్స్ అయ్యాడు.
ఇక ఐకాన్ సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు క్లారిటీ అయితే ఇచ్చాడు.. ఆ సినిమా ఉండదు అని చెప్పలేదు కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కాబట్టే ఐకాన్ సినిమా కూడా అదే రేంజ్ కు తగ్గట్టుగా ఉండాలి అని పుష్ప 2 తర్వాత ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందన్న తర్వాతనే ఐకాన్ సినిమా అందుకు తగ్గట్టుగా ఉంటుంది అని అన్నారు.
అయితే పక్కాగా ఆ సినిమా తెరపైకి వస్తుంది అనే విషయాన్ని కూడా దిల్ రాజు నమ్మకంగా చెప్పలేకపోయారు. కానీ బన్నీ తో మాత్రం కమిట్మెంట్ అయితే ఉంది అని ఐకాన్ స్క్రిప్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సెట్ అయితే మాత్రం అదే తరహాలో ఉంటుంది అని వివరణ ఇచ్చారు. మరి దర్శకుడు వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తాడో లేదో చూడాలి.