ఈ రోజు మహర్షి వాయిదా గురించి చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు చాలా తెలివిగా కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఇప్పటికే రెండు తేదీలు మారి మూడో సారి మార్చడం పట్ల అభిమానులు గుర్రుగా ఉన్నారని ముందే తెలిసి సాధ్యమైనంత మేరకు సెంటిమెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. దాని కోసం మే నెల వైజయంతి బ్యానర్ కు తన సంస్థకు ఎలా కలిసి వచ్చిందో కొన్ని ఉదాహరణలు చెప్పారు. అయితే మహేష్ కు మూడు డిజాస్టర్లు ఇదే నెలలో ఉండటాన్ని చాలా స్మార్ట్ గా వదిలేసిన దిల్ రాజు మొత్తానికి వీలైనంత త్వరగా మ్యాటర్ ని చెప్పేసి పోదామనే తొందరపాటైతే బాగా కనిపించింది.
హీరోలకు దర్శక నిర్మాతలకు కొన్ని సెంటిమెంట్స్ ఉండటం సహజం. అయితే అవి అన్నివేళలా వర్క్ అవుట్ కావు.టాలీవుడ్ లో ఇప్పటి దాకా ద్వితీయ విఘ్నం తప్పించుకోలేక ప్లాప్ తిన్న దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే దీన్ని సమర్ధవంతంగా ఎదురుకుని సక్సెస్ అయిన రాజమౌళి-కొరటాల శివ-బోయపాటి శీను లాంటి వాళ్ళ లిస్ట్ కూడా పెద్దదే. మరి ఇది అందరికి వర్తించాలి కదా. మహేష్ అయినా ఇంకో హీరో అయినా డిజాస్టర్లు అయ్యాయి అంటే వాటిలో ఉన్న వీక్ కంటెంట్ తప్ప మరొకటి కాదు. బలమైన విషయం ఉండి సినిమా ఫ్లోప్ కావడం ముఖ్యంగా స్టార్ హీరోలకు అసలు జరగదు.
ఇప్పుడు వేరే కారణాలు చెప్పే అవకాశం లేకపోవడంతో దిల్ రాజు నెలల పాట అందుకున్నారు కాని మే నెలలోనే వచ్చిన మహేష్ సినిమాల చేదు ఫలితాలు మహేష్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతున్నాయి. ఇవన్నీ కాదు కానీ మెప్పించే మ్యాటర్ ఉంటే ప్రళయం వచ్చినా స్టార్ హీరోల సినిమాలు దుమ్ము దులిపేస్తాయి. మహర్షి అదే కోవలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్న అభిమానుల ఆశలు నెరవేరే రోజు మే 9 అవుతుందో లేదో అప్పటిదాకా వేచి చూడక తప్పదు