సంక్రాంతి సమరం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు అగ్నిపరీక్ష కానుందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ ల తొలి కాంబినేషన్ లో RC 15 ని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరన దశలో వుంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు దిల్ రాజు తొలి సారి తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా ఓ భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని తమిళంలో 'వారీసు'గా తెలుగులో 'వారసుడు'గా రూపొందిస్తున్నారు. పేరుకి బై లింగ్వల్ మూవీ అని ప్రచారం జరుగుతున్నా ఈ మూవీని తమిళంలో మాత్రమే రూపొందిస్తున్నారు. తెలుగులో అనువాదం చేయబోతున్నారు. విజయ్ కి తమిళంలో భారీ మార్కెట్ వున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఇటీవల మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఈ మూవీకి తమిళంతో పాటు తెలుగులోనే మంచి డిమాండ్ ఏర్పడింది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీపావాళి సందర్భంగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో ఓకేసారి విడుదల చేయాలని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు థియేటర్లపై కర్చీఫ్ వేసేసారు. విజయ్ కున్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.
అంతే బాగానే వుంది కానీ ఈ మూవీ దిల్ రాజుకు అగ్నిపరీక్షగా మారబోతోందని ఇన్ సైడ్ టాక్. సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' కూడా రిలీజ్ కాబోతోంది. నైజాం ఏరియాలో ఈ నాలుగు సినిమాలకు సమానంగా థియేటర్లని కేటాయించాలి. అతి కత్తిమీద సామే. ఏ ఒక్కరికి ప్రధాన థియేటర్ తో పాటు ఇతర కీలక థియేటర్లు దక్కకపోతే ఫ్యాన్స్ రచ్చ చేయడం కామన్.
దిల్ రాజు ఈ గండం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం వుంది. చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 107వ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' సినిమాలని మించి విజయ్ 'వారసుడు'లో కంటెంట్ వుంటే తప్ప ఈ సినిమా గట్టెక్కడం కష్టం. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు హీరో ఎవరైనా చూడటం లేదు. కంటెంట్ కు ప్రధాన్యతన నిస్తున్నారు. 'వారసుడు' సినిమాలో కంటెంట్ వుంటే తప్ప జనం విజయ్ సినిమాకు రావడం కష్టమే.
తెలుగు సినిమాల భారీ పోటీ నుంచి 'వారసుడు'ని పక్కకు తప్పించి ఆ తరువాత రిలీజ్ చేస్తానంటే విజయ్ అంగీకరించడు..తమిళంలో రిలీజ్ అయిన రోజు తెలుగులోనూ రిలీజ్ కావాలన్నది హీరో విజయ్ కండీషన్.. మరి ఈ అగ్నిపరీక్ష నుంచి దిల్ రాజు ఎలా బయటపడతాడో.. సంక్రాంతి పోరులో ఏం జరగనుందో తెలియాలంటే సంక్రాంతి సమరం మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.