తెలుగు స్టార్ హీరోలను పక్కన పెట్టి తమిళ హీరోల మీద గురి పెట్టాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పటికే దళపతి విజయ్ తో వారసుడు సినిమా చేసిన ఆయన నెక్స్ట్ లిస్ట్ లో ధనుష్ తో సినిమా ప్లానింగ్ చేస్తున్నారట.
ధనుష్ ఇప్పటికే తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా ఓకే చేశాడు. తెలుగులో ఆల్రెడీ రెండు క్రేజీ సినిమాలు చేస్తుండగా ధనుష్ తో ఇదే కరెక్ట్ టైం అని మరో సినిమా ఫిక్స్ చేసుకున్నారట దిల్ రాజు.
శ్రీకారం డైరెక్టర్ కిశోర్ రెడ్డి ధనుష్ కి తగిన కథని సిద్ధం చేయగా లైన్ నచ్చిన ధనుష్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు టాక్. విజయ్ సినిమా తర్వాత దిల్ రాజు చేస్తున్న తమిళ హీరో ప్రాజెక్ట్ ఇదే అని చెప్పొచ్చు.
అంతేకాదు తమిళ దర్శకుడు శంకర్ తో కూడా రాం చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు హీరోలతో అయితే తెలుగు మార్కెట్ వరకే ఉంటుందని అనుకున్నాడో ఏమో కానీ దిల్ రాజు వరుస తమిళ హీరోల సినిమాలు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
అందుకే తమిళ దర్శకుడు తెలుగు హీరో.. తెలుగు దర్శకుడు తమిళ హీరో ఇలా క్రేజీ కాంబినేషన్స్ తో దిల్ రాజు మెగా స్కెచ్ వేశాడు. తప్పకుండా దిల్ రాజు ఈ ఫార్ములాతో భారీ విజయాలు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. వారిసు సినిమా తమిళ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసిన దిల్ రాజు ధనుష్ సినిమాకు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
దిల్ రాజు మెగా ప్లాన్ లో తమిళ హీరోలు ఫిక్స్ అయ్యారు. ఎలాగు ఆయన ప్రొడక్షన్ కి మంచి వాల్యూ ఉంది కాబట్టి తెలుగు మార్కెట్ పెంచుకునేందుకు తమిళ స్టార్స్ కూడా దిల్ రాజు ఆఫర్ ని ఓకే చెప్పేస్తున్నారు. సో మొత్తానికి తమిళ, తెలుగు ఈ కాంబినేషన్స్ తో త్వరలో అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయని దిల్ రాజు హింట్ ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.