ఏటేటా ఉత్తమ చిత్రాలను ప్రకటించడం ఆనవాయితీ. ప్రభుత్వం దగ్గర నుంచి అనేక సంస్థలు ఈ ఉత్తమ అవార్డులను ప్రకటిస్తుంటాయి. అయితే.. బాలీవుడ్ చెత్త సినిమాలకు అవార్డ్ ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంది. గోల్డెన్ కేలా అవార్డ్స్ అంటూ గత ఏడేళ్లుగా ఈ అవార్డులను ఇస్తున్నారు. ఇప్పుడు 8వ గోల్డెన్ కేలా అవార్డులను ప్రకటించారు. ఇందులో షారూక్ ఖాన్ మూవీ దిల్ వాలే.. ఉత్తమ చెత్త చిత్రం అవార్డును దక్కించుకుంది.
బాంబే వెల్వెట్ - షాందార్ తేవర్ - సింగ్ ఈజ్ బ్లింగ్ లతో పోటీ పడిన దిల్ వాలే.. వరస్ట్ మూవీగా నిలిచింది. ఇక సల్మాన్ ఖాన్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయోలో హీరోయిన్ గా నటించిన సోనమ్ కపూర్ కు వరస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కించుకుంది. ఈ సుందరాంగి ఏబీసీడీ2లో శ్రద్ధా కపూర్ ను - సింగ్ ఈజ్ బ్లింగ్ లో అమీ జాక్సన్ నటనను ఓడించి మరీ.. గోల్డెన్ కేలా అవార్డు గెలుచుకుంది. ఇక హీరో చిత్రానికి ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా అనేక అవార్డులు అందుకున్నాడు సూరజ్ పంచోలి. ఇదే యాక్టర్ ని వరస్ట్ యాక్టర్ గా గోల్డెన్ కేలా అవార్డుకు కూడా ఎంపిక కావడం విశేషం.
మన దగ్గర బెస్ట్ అవార్డులను అందుకోవడానికి వెళ్లడమే అంతంతమాత్రం. అయితే.. బాలీవుడ్ లో ఈ గోల్డెన్ కేలా అవార్డులను అందుకునేందుకు ఆయా నటుల్లో చాలామంది స్వయంగానే వెళ్లడం విశేషం. మరి ఈ ఏడాది ఈ అవార్డులను అందుకునే ధైర్యం ఎవరు చేస్తారో?