ఎఫ్4 లో ఎవరెవరు ఉంటారంటే..?

Update: 2022-06-09 00:30 GMT
బాలీవుడ్లో గోల్మాల్, హౌస్ ఫుల్ కామెడీ సినిమా ఫ్రాంఛైజీల గురించి తెలియని వారుండరు. కానీ టాలీవుడ్లో ఇప్పటి వరకు అలాంటి సినిమాలు రాలేదు. కానీ ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు సినిమాల్లోనూ ఫ్రాంచైజీ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఎఫ్2 విజయోత్సాహంతో ఎఫ్3 సినిమా తీశారు అనిల్. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరి ఎఫ్4 సినిమా తీయడానికి ఆజ్యం పోసింది. ప్రేక్షకులు ఆదరిస్తున్నంత కాలం ఈ ఫన్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూనే ఉంటానని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

ఫన్, ఫ్రస్ట్రేషన్ అంటూ పెళ్లైన మగాళ్ల ఫ్రస్ట్రేషన్ ప్రేక్షకులకు ఫన్గా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2 అందించిన విజయోత్సాహంతో ఎఫ్3 సినిమా తీశారు. కరోనాతో విలవిలలాడుతున్న ప్రజల జీవితాల్లో ఎఫ్3 కాస్త ఎక్కువ ఫన్నే నింపింది. అందుకే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సక్సెస్ ఊపులో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ ఫన్ ఫ్రాంచైజీని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు.  డ‌బ్బులు వ‌స్తున్నంత వ‌ర‌కూ ఈ క్రేజ్తో ఎఫ్ 3, ఎఫ్ 4, ఎఫ్ 5 తీస్తూనే ఉండాల‌న్న‌ది నిర్మాత దిల్ రాజు ఉద్దేశం కూడా. ఎఫ్ 3కి  బాగానే డ‌బ్బులు వ‌చ్చేశాయి కాబ‌ట్టి, ఎఫ్ 4 తీయాలని నిర్ణయించారు.

ఎఫ్ 4 సినిమా రావాలంటే కాస్త సమయం పడుతుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఆయన త్వరలో బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నారు. ముందు బాలయ్య బాబుతో సినిమా తీస్తారు. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తైన తర్వాతే ఎఫ్ 4 పట్టాలెక్కుతుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

ఎఫ్ 4 సినిమాలో ఎవరెవరు ఉంటారనే దానిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా లోనూ వెంకటేష్, వరుణ్ తేజ్ కంటిన్యూ అవుతారని చెప్పారు. కానీ తమన్నా, మెహరీన్ పాత్రలకు రిప్లేస్మెంట్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ 4 రావడానికి మరో రెండేళ్లయినా పడుతుందని.. ఈలోగా చాలా మార్పులు జరగొచ్చని అనిల్ అన్నారు.

ఇప్పటికే ఎఫ్3 షూటింగ్ లో తమన్నా కు అనిల్ రావిపూడికి మధ్య ఏదో గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక రెండు సినిమాల్లోనూ మెహరీన్ చూసిన ప్రేక్షకులు ఇక ఆమె కొనసాగింపును అంతగా ఇష్టపడకపోవచ్చు. ఎఫ్ 2, ఎఫ్ 3 కథలకు సంబంధమే లేదు కాబట్టి ఎఫ్ 4 కథ కూడా డిఫరెంట్ గానే ఉంటుందట. మరి ఆ  ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీ లో మనకు ఫన్ పంచే స్టార్లెవరో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News