టాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ - బాలీవుడ్ ...ఇలా భారతీయ సినీరంగాన్ని `పైరసీ`భూతం పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమా ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి....సినిమాను తెరకెక్కించిన నిర్మాతలు పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు రూపొందించినా...ఈ పైరసీని రూపుమాపడం ప్రస్తుతానికి సాధ్యపడలేదు. పైరసీని ప్రోత్సహించవద్దంటూ....పలువురు సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నా....ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా, పైరసీపై ఓ చిత్ర దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా పైరసీ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసుకొని చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాప్సి - రిషి కపూర్ - ప్రతీక్ బబ్బర్ - అశుతోష్ రాణా ప్రధాన పాత్రలు పోషించిన ‘ముల్క్’సినిమా నేడు విడుదలైంది. భారత్ - పాక్...హిందూ - ముస్లింల మధ్య స్నేహం - ప్రేమ విరసిల్లే కాన్సెప్ట్ తో అనుభవ్ సిన్హా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు నిషేధించింది. ఈ నేపథ్యంలో `ముల్క్` సినిమా పైరసీ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసుకుని చూడాలని పాకిస్థాన్ ప్రేక్షకులకు అనుభవ్ సిన్హా లేఖ రాశారు. తన చిత్రాన్ని పాక్ సెన్సార్ బోర్డు నిషేధించడంతోనే ఈ రకంగా లేఖ రాస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని పాక్ ప్రజలు చూడకూడదనే అక్కడ సినిమాను బ్యాన్ చేశారని, భవిష్యత్తులో ఈ సినిమాను చూస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అయితే, పాక్ ప్రజలంతా లీగల్ గా తన సినిమా చూడాలని ఉందని, కానీ లీగల్ గా కుదరని పక్షంలో డిజిటల్ ప్లాట్ ఫాంలో ఇంట్లో కూర్చుని అనధికారంగానైనా చూడాలని అనుభవ్ అన్నారు. దయచేసి తమ సినిమా చూడాలని - పాక్ సెన్సార్ బోర్డు నిషేధం ఎందుకు విధించిందో చెప్పాలని కోరారు. అయితే, తమ చిత్ర బృందం పైరసీని ఆపడానికి కష్టపడుతోందని కూడా అనుభవ్ ట్వీట్ చేయడం కొసమెరుపు. అయితే, పైరసీని ఎంకరేజ్ చేస్తున్నట్లు లేఖ రాసిన అనుభవ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిషేధం ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకోవడం మానేసి ఇలాంటి లేఖలు రాయడం ఏమిటని మండిపడుతున్నారు.