పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇందులో రామయణ గాధ ఆధారంగా జపనీస్ మూవీ స్ఫూర్తితో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా సీజీ వర్క్ జరుపుకుంటోంది. ఇక 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్' మూవీలో నటిస్తున్నాడు.
హై వోల్టేజ్ పీరియాడ్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ కె'. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ యాభై శాతం పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న ప్రభాస్ .. డైరెక్టర్ మారుతితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ప్రభాస్ స్టోరీ విని చాలా రోజులే అవుతున్నా రెగ్యులర్ షూటింగ్ కి సమయం, డేట్స్ కుదరకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర బృందం ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించినున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ మారుతితో సినిమా చేయడం రిస్క్ అని హెచ్చరిస్తున్నా ప్రభాస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తనతో సినిమా చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నారు.
హారర్ థ్రిల్లర్ కథతో ఓ సినిమా థియేటర్ నేపథ్యంలో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని, దాదాపుగా ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ప్రభాస్ లేకుండానే దర్శకుడు మారుతి ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నారట. ఈ మూవీ కథకు అత్యంత కీలకంగా నిలిచే భారీ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో తీర్చిదిద్దుతున్నారట. వన్స్ సెట్ పనులు పూర్తయితే మిగతా తారగణంతో ప్రభాస్ లేకుండానే కొన్ని కీలక ఘట్టాలని మారుతి తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటు్నాడట.
ప్రభాస్ లేని సీన్ లన్నీ ముందు పూర్తి చేసి నవంబర్ నుంచి ప్రభాస్ సీన్ లని ప్రారంభించాలని పక్కా ప్లాన్ తో మారుతి వున్నట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ డేట్స్ కూడా నవంబర్ నుంచే అందుబాటులో వుండటంతో మారుతి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడట. కథ ప్రధానంగా 'రాజా డీలక్స్' అనే సినిమా థియేటర్, నిధి అన్వేషణ నేపథ్యంలో సాగుతుందట.
హారర్ థ్రిల్లర్ అంశాలకు తనదైన మార్కు కామెడీని జోడించి మారుతి ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. అదే అంశం ప్రభాస్ కు నచ్చడంతో ఈ మూవీని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సినిమాలోని కీలక పాత్రలో బాలీవుడ్ బ్యాడ్ మెన్ సంజయ్ దత్ కనిపించనున్నారట. ఇప్పటికే ఆయనకు కథ వినిపించడం, తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని ఇన్ సైడ్ న్యూస్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.