అభిమన్యుడి మిత్రుడితో అఖిల్

Update: 2018-11-28 06:27 GMT
డెబ్యూతో కలిపి మూడేళ్ళలో కేవలం రెండు సినిమాలకే పరిమితమైన అఖిల్ తన మూడో సినిమా మిస్టర్ మజ్ను మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. పేరున్న దర్శకులతో చేసినా అఖిల్-హలో తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులు కూడా దీని మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఒక్క పాట తప్ప షూటింగ్ మొత్తం పూర్తయిన మిస్టర్ మజ్ను డిసెంబర్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత మూవీకి కూడా అఖిల్ రెడీ అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్.

ఈ ఏడాది డబ్బింగ్ మూవీస్ లో టాప్ హిట్ గా నిలిచిన అభిమన్యుడు దర్శకుడు మిత్రన్ చెప్పిన లైన్ ఒకటి అఖిల్ కి బాగా నచ్చడంతో డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. షూటింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే క్లారిటీ లేదు కానీ మిస్టర్ మజ్ను విడుదల అయ్యే లోపు స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. కోలీవుడ్ లో మంచి ఆఫర్స్ ఉన్నప్పటికీ మిత్రన్ కోరి మరీ అఖిల్ దాకా ఎందుకు వచ్చాడో సస్పెన్స్. డెబ్యూ మూవీతోనే మూవీ లవర్స్ ని మెప్పించిన మిత్రన్ వెబ్ క్రైమ్ ని నేపధ్యంగా తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా తీసిన తీరు కమర్షియల్ సక్సెస్ ని కూడా ఇచ్చింది.

అఖిల్ కు చెప్పిన పాయింట్ కూడా చాలా వైవిధ్యంగా ఉందని రెగ్యులర్ లవ్ స్టోరీస్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా మిత్రన్ విభిన్నమైన నేపధ్యాన్ని తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మరి అఖిల్ నిజంగా ఒప్పుకున్నాడా లేక ఆ మధ్య ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలు విని డ్రాప్ అయినట్టు దీన్ని చివర్లో వద్దంటాడా ప్రస్తుతానికి సస్పెన్స్. మిస్టర్ మజ్ను సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు ఆరు నెలలు కథలు వినడంలోనే గడిపేసిన అఖిల్ మెచ్చేలా మిత్రన్ చెప్పిన లైన్ ఏముందో వేచి చూడాలి
    

Tags:    

Similar News