ప్రముఖ తమిళ దర్శకుడు.. జాతీయ అవార్డును సైతం పొందిన దర్శకుడు శీను రామస్వామి ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు నన్ను కాపాడండి.. నేను ప్రమాదంలో ఉన్నాను నన్ను కొందరు టార్గెట్ చేసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా ప్రాణాలకు సైతం ప్రమాదం ఉంది అంటూ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఈయన విజయ్ సేతుపతిని '800' సినిమా చేయవద్దంటు సున్నితంగా హెచ్చరించాడు. అప్పటి నుండి ఈ బెదిరింపులను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళిధరన్ సినిమాను విజయ్ సేతుపతి చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చనప్పటి నుండి కూడా అనేక వివాదాలు రాజుకుంటున్నాయి. ప్రముఖులు కొందరు విజయ్ సేతుపతి ఆ సినిమాను చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించారు. మరి కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను చేయవద్దని హెచ్చరించారు. దర్శకుడు రామస్వామి కూడా తనకు విజయ్ తో ఉన్న సన్నిహిత్యం నేపథ్యంలో 800 సినిమా చేయవద్దని చెప్పాడు. దాంతో అప్పటి నుండి అతడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఆ కారణంగానే తనను కాపాడాలంటూ సీఎంకు రామస్వామి మొర పెట్టుకున్నాడు.