రంగుల ప్రపంచంలో ఆల్కహాల్ అడిక్షన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ రంగంలో ఒత్తిళ్లను అధిగమించేందుకో లేకపోతే ఐడియాలు రాలేదనో దర్శకరచయితలు ఆర్టిస్టులు ఆల్కహాల్ సేవిస్తూనే ఉంటారు. రేర్ గా మాత్రమే అడిక్షన్ లేనివాళ్లు ఉన్నారు. అయితే ఓ ప్రముఖ దర్శకుడు తన ఆల్కహాలిక్ హ్యాబిట్ గురించి బహిరంగంగా మీడియా ముందు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
కన్నడ- తెలుగు పరిశ్రమల్లో అగ్ర దర్శకుడిగా పాన్ ఇండియా వేవ్ తో దూసుకొచ్చిన అతడు తాజాగా కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆల్కహాల్ సేవించాకే స్క్రిప్టులు రాస్తానని తెలిపాడు. అయితే ఈ ఇంటర్వ్యూ నుండి ఈ భాగాన్ని తీసివేస్తానని మీరు వాగ్దానం చేస్తేనే నేను మీకు ఇది చెబుతాను.. అని అన్నారు.
"నేను తరచుగా మద్యం సేవించిన తర్వాత నా స్క్రిప్ట్ లను రాస్తాను. నేను మత్తులో ఉన్నప్పుడు కూడా అదే ఎక్కువ అనిపిస్తే... దానికి కావాల్సింది ఇంకా ఉందని నేను ఒక నిర్ధారణకు వస్తాను" అని అన్నారు.
నిజానికి కథ కాదు కానీ దానిని ప్రదర్శించిన విధానం చాలా ముఖ్యమైనది అని కూడా అతడు టాప్ సీక్రెట్ రివీల్ చేశాడు. తాను ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రానికి పని చేస్తున్నానని తన తదుపరి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31 అని కూడా స్పష్టం చేశాడు.
అయితే ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఉన్న అతడు మీడియా ముందు అలా చెప్పాల్సింది కాదేమో! అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలో ఆల్కహాల్ సేవించని దర్శకుడు ఎవరున్నారు? ఒక ప్రముఖ దర్శకుడు అయితే తనకు మూడ్ చెడినప్పుడు పోర్నోగ్రఫీ సైట్లు చూస్తానని కూడా చెప్పారు.
కానీ ఈ రోజుల్లో శృంగార వెబ్ సైట్లు చూడని పురుషుడు ఎవరున్నారు? అతి వాదం అంతకంతకు పెరుగుతున్న ఈ మోడ్రన్ డేస్ లో ప్రతిదీ బయటికే చెప్పేయాలని అనుకుంటారు. కొందరు మాత్రమే కొన్నిటిని దాచుకోగలుగుతున్నారు. దాచడం సులువు.. ఓపెనవ్వడం చాలా ఈజీ.