యూనివ‌ర్శ‌ల్ `పాన్ వ‌ర‌ల్డ్ ఐక‌న్ స్టార్` అని నిరూపించాలి!

Update: 2021-04-08 06:30 GMT
మెగాస్టార్ అనే పేరును సార్థకం చేసుకునేందుకు చిరంజీవి ఎంత‌గా శ్ర‌మించారో అభిమానుల‌కు తెలుసు. అందుకే ఆయ‌న‌‌‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు ఫ్యాన్స్. మెగా వృక్షం నీడ‌లో కెరీర్ మొద‌లైనా నెమ్మ‌దిగా త‌న‌కంటూ యూనిక్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని.. ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవ‌డంలో అల్లు అర్జున్ స‌ఫ‌ల‌మ‌య్యారు.

అల్లు అర్జున్ అంటేనే స్టైల్. అందుకే స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. తాను న‌టించే ప్ర‌తి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపించ‌డం దానికి త‌గ్గ‌ట్టు ఎన‌ర్జీతో మెప్పించ‌డం బ‌న్నికి కొత్తేమీ కాదు. ప్ర‌తిసారీ స్టైలింగ్ ప‌రంగా కొత్త‌దనాన్ని ప‌రిచ‌యం చేస్తుంటారు. యువ‌త‌రం అతడి స్టైల్ ని అనుక‌రించేందుకు అమితాస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ అత‌డికి మాత్ర‌మే సూట‌బుల్ అని కూడా అంతా అంగీక‌రిస్తారు.

ఇప్పుడు పుష్ప టీజ‌ర్ రాక‌తో అత‌డిని ఐక‌న్ స్టార్ ని చేశారు. ఇక‌పై బ‌న్నిని ఐక‌న్ స్టార్ అని పిల‌వాల‌ని సుక్కూ సూచించాడు. అంటే ఇక మీద‌ట స్టైలిష్ స్టార్ అనేది వ‌దిలేయాలా? అంటూ అభిమానుల్లో సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే బ‌న్ని పాన్ ఇండియా హీరోగా క‌నెక్ట‌వ్వాలంటే ఐక‌న్ స్టార్ అనేదే సూట‌బుల్. స్టైలిష్ స్టార్ కంటే ఎక్కువ మైలేజ్ ఉంటుంది ఈ బిరుదుకి అంటూ విశ్లేషిస్తున్నారు.

అయితే ఈ ట్యాగ్ అల‌వాటు ప‌డాలంటే అభిమానుల‌కు కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇక ట్యాగ్ ఇచ్చేయ‌డం బాగానే ఉంటుంది కానీ దానికి త‌గ్గ‌ట్టే చాలా మార్పు చూపించాలి బ‌న్ని. మేకోవ‌ర్ ఛేంజోవ‌ర్లు చూపించాలి. న‌ట‌న ప‌రంగా స్టైల్ కంటెంట్ ప‌రంగా త‌నకు మ‌రింత బాధ్య‌త పెరిగిన‌ట్టే. ఇక‌పై ఎంచుకునే పాత్ర‌లు క‌థ‌లతో పాటు ప్ర‌తిదీ మారాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు లోక‌ల్ మార్కెట్ అనుకుంటే స‌రిపోయేది. ఇప్పుడు కేవ‌లం పాన్ ఇండియా.. పాన్ వ‌ర‌ల్డ్ అంటూ కొత్త లెక్క‌లు చెబుతున్నారు. యూనిర్శ‌ల్ మార్కెట్ స్థాయికి త‌గ్గ‌ట్టే ఎంచుకునే కంటెంట్ కూడా ఉండాలి. బ‌న్ని త‌న అభిమానులు కోరుకున్న‌ట్టే యూనివ‌ర్శ‌ల్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ అవుతాడా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News