నాది తప్పుడు ఉద్దేశ్యం కాదు.. బాధపడి ఉంటే సారీ

Update: 2021-01-06 06:42 GMT
తమిళ విలక్షణ దర్శకుడు సుశీంద్రన్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో వివాదాస్పదం అయ్యాడు. ఆయన హీరోయిన్‌ ను ఇబ్బంది పెట్టేలా స్టేజ్‌ పై వ్యవహరించాడు అంటూ నెటిజన్స్ ఒక వీడియోను షేర్‌ చేసి మరీ ట్రోల్‌ చేశారు. ఆ వీడియోలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ను సుశీంద్రన్‌ మాట్లాడుతున్న సమయంలో అడ్డు తగులుతూ తాను చెప్పింది మాట్లాడాలంటూ ఒత్తిడి చేసినట్లుగా ఉంది.

శింబు హీరోగా రూపొందిన 'ఈశ్వరన్‌' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్బంగా ఈ సంఘటన జరిగింది. ఆ కార్యక్రమంలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ఉండగా పక్కన ఉన్న దర్శకుడు సుశీంద్రన్‌ శింబు మామ ఐ లవ్‌ వ్యూ అనాలంటూ సూచించాడు. ఆ సమయంలో నిధి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది.

నిధి అగర్వాల్ ను ఇబ్బంది పెట్టేలా సుశీంద్రన్‌ వ్యవహరించాడు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అసహనం వ్యక్తం చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు సుశీంద్రన్‌ క్లారిటీ ఇచ్చాడు. స్వయంగా నిధి అగర్వాల్‌ తో కలిసి ప్రెస్ మీట్ లో సుశీంద్రన్‌ పాల్గొన్నాడు. ఆ సమయంలో తాను నిధిని ఇబ్బంది పెట్టాలని అలా చేయలేదు. సినిమాలో ఆమె పాత్ర మామ ఐ లవ్ వ్యూ అంటూ హీరో వెంట పడుతూ ఉంటుంది.

సినిమాలో మాదిరిగా సరదాగా అలా అంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో అనమన్నాను తప్ప మరే ఉద్దేశ్యం లేదని.. తనకు ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యాలు లేవు అంటూ సుశీంద్రన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక వేళ తాను అలా అన్నందుకు ఎవరైనా బాధ పడి ఉంటే సారీ అంటూ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా సుశీంద్రన్‌ క్లారిటీ ఇచ్చేశాడు.
Full ViewFull View
Tags:    

Similar News