ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` హిట్టా ఫ్లాపా? అన్న ప్రశ్నకు ఇటీవల దర్శకుడు తేజ ఇచ్చిన స్టేట్ మెంట్ బన్ని అభిమానులకు షాకిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప భారీ నష్టాలను చవిచూసిందని ఆయన వివాదాన్ని రేకెత్తించారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తేజపై అల్లు అర్జున్ అభిమానులు విరుచుకుపడ్డారు.
పుష్ప ఇప్పటికే బ్లాక్ బస్టర్ చిత్రంగా రికార్డులకెక్కింది. అటు హిందీ బెల్ట్ లో ఇంకా పెద్ద హిట్టు చిత్రంగా నిలిచింది. ఇలాంటప్పుడు తేజ ఎందుకు ఈ కామెంట్ చేసారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇప్పటికే పుష్ప పై తేజ త న వ్యాఖ్య ల పై క్లారిటీ ఇచ్చాడు. పుష్ప తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయిందని అయితే అది ఫ్లాప్ సినిమా కాదని ఆయన పేర్కొన్నారు.
``నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పుష్పకు నష్టం వాటిల్లిందని చెప్పాను తప్ప ఫ్లాప్ అనలేదు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్ల సమస్య. ఇది మంచి సినిమా.. ఫ్లాప్ కాదు. టిక్కెట్ ధరల సమస్య కారణంగా భారీ వసూళ్లు రాబట్టలేకపోయిన మంచి సినిమా ఇది`` అని వివరణ ఇచ్చారు.
ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య ఆ సమయంలో కొన్ని మంచి చిత్రాలపై ప్రభావం చూపిందని తేజ అన్నారు. కానీ ధరలు పెరిగినప్పుడు కొన్ని చెత్త సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ లో నిలిచాయి.. అని వివరణ ఇచ్చారు.
అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో తేజ అందరికీ టచ్ లోకి వస్తుంటారు. కానీ ఈసారి ఆయన ఒక బ్లాక్ బస్టర్ చిత్రంతో లైమ్ లైట్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి విజయం సాధించినా ఆ తర్వాత తేజ నుంచి సరైన సినిమా ఏదీ రాకపోవడం విస్మయపరిచింది. తేజ బ్రాండ్ లవ్ స్టోరి ఇటీవలి కాలంలో తెలుగు ఆడియెన్ కి కనిపించలేదు. మునుపటిలా నవతరం స్టార్లతో ఆయన అలాంటి ప్రయోగాలు చేసే సన్నివేశం కూడా కనిపించడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.