ప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేదు. కంచె చిత్రంతో కుర్రకారు గుండెల్లో ట్రెడిషనల్ గాళ్ గా ముద్ర వేయించుకున్న ఈ బ్యూటీ వాస్తవంలో అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుందన్నది తెలిసిన వ్యవహారమే. బికినీలు స్విమ్ సూట్లతో చెలరేగడం ప్రగ్యా హ్యాబిట్.
ఇటీవల బాడీ హగ్గింగ్ డ్రెస్ లతో ప్రఖ్యాత సీకే బ్రాండ్ కి ప్రచారం చేసింది. ప్రగ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ లో కొన్ని ఫోటోలు హెడ్ టర్నర్ గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు చీరలో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు వైవిధ్యమైన డిజైనర్ లుక్ లతోను ప్రగ్య మెరిపిస్తోంది. ఇంతకుముందు లాక్మే ఫ్యాషన్ వీక్ 2022లో సందడి చేసిన ఈ బ్యూటీ తాజాగా తన కొత్త లుక్ ఒకటి షేర్ చేయగా వైరల్ గా మారింది.
సాంప్రదాయ దుస్తులే కాదు.. ప్రగ్యా పాశ్చాత్య దుస్తుల్లోను తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టదు. గత వారం పొట్టి స్లీవ్ లెస్ లెమన్ ఎల్లో డ్రెస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఆమె తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజా లుక్ లో బ్లూ షేడ్ తో ఊల్ దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రగ్య కోసం అందించారని అర్థమవుతోంది. ఇది పూర్తిగా బాడీ హగ్గింగ్ లుక్ కావడంతో థై సొగసుల ఎలివేషన్ హైలైట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
గత కొంతకాలంగా ప్రగ్య న్యూలుక్ తో ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ లుక్ కి మారింది. అయితే దీనికోసం కొన్ని నెలల పాటు సుశిక్షితుడైన కోచ్ సమక్షంలో మేకోవర్ కోసం శ్రమించింది. రెగ్యులర్ జిమ్ యోగా సాత్విక ఆహారంతో ఈ మార్పు సాధ్యమైంది. అయితే తన ఫిట్ నెస్ వెనక.. ఈ కొత్త లుక్ వెనక ఉన్నది ఎవరో కూడా ప్రగ్య తాజాగా రివీల్ చేసింది. అతడి పేరు అమిత్ దాహియా. జిమ్ లో సాధన కోసం ప్రత్యేకంగా నియమించుకుంది.
ప్రగ్యా కెరీర్ మ్యాటర్ కి వస్తే... 2014లో ద్విభాషా థ్రిల్లర్ చిత్రం `విరాట్టు`లో తొలిసారిగా నటించింది. కానీ ఆమె 2015లో పీరియాడిక్ డ్రామా `కంచె`తో విజయం అందుకుంది. ఈ సినిమాతో ఉత్తమ ఫీమేల్ డెబ్యూ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత గుంటూరోడు- టిటూ ఎంబీఏ- ఓం నమో వేంకటేశాయ- ఆచారి అమెరికా యాత్ర- నక్షత్రం- అఖండ వంటి పలు పాపులర్ ప్రాజెక్ట్ లలో ఆమె నటించింది.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మిస్తున్న సినిమాలోను నటించింది. డైమండ్ రత్నబాబు రచించి దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`లో ఆమె ఇటీవల కనిపించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు- మీనా- శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ సరసన ఓ చిత్రంలో నటించినా ఆశించిన విజయం దక్కలేదు. దాంతో తిరిగి సౌత్ లోనే సీరియస్ గా ప్రయత్నాల్లో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View