పాయల్‌ కు సొంత బ్రాండ్‌ అంత క్రేజ్‌ ఉందా? ‌

Update: 2020-11-15 04:45 GMT
విజయ్‌ దేవరకొండ.. ఆ తర్వాత మహేష్‌ బాబు ఈమద్య సమంత ఇలా పలువురు స్టార్స్‌ వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టారు. తమకంటూ సొంతంగా బ్రాండ్‌ లను ప్రారంభించారు. విజయ్‌ దేవరకొండ రౌడీ బ్రాండ్‌ ను మొదలు పెట్టగా సమంత సాకీ వరల్డ్‌ అంటూ బ్రాండ్‌ ను మొదలు పెట్టింది. స్టార్స్‌ అయిన వారి బ్రాండ్స్‌ కు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ ప్రారంభించిన రౌడీ బ్రాండ్‌ కు అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. యూత్‌ విపరీతంగా ఆ బ్రాండ్‌ పట్ల ఆకర్షితం అవుతున్నారు. సమంత బ్రాండ్‌ పై కూడా జనాల్లో ఇంట్రెస్ట్‌ ఉంది. వారి దారిలో ఇప్పుడు పాయల్‌ రాజ్ పూత్‌ కూడా చేరింది.

పాయల్‌ ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్‌ అయ్యి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా సక్సెస్‌ అయిన తర్వాత మళ్లీ ఆ స్తాయిలో సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయింది. ఈమద్య కాలంలో ఓటీటీ కోసం కూడా నటిస్తుంది. హీరోయిన్‌ గా ఒక మోస్తరు క్రేజ్‌ ను మాత్రమే దక్కించుకున్న ఈ అమ్మడు సొంతంగా బ్రాండ్‌ ను మొదలు పెట్టడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీపావళి సందర్బంగా పాయల్‌ గూమ్ఫీ అంటూ తన సొంత బ్రాండ్‌ ను అనౌన్స్‌ చేసింది. స్టార్‌ డమ్‌ ఉన్నా లేకున్నా ఒక్కసారి గూమ్ఫీ పై జనాల్లో ఆసక్తి మొదలు అయితే ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పాయల్‌ కు సొంత బ్రాండ్‌ ఏర్పాటు చేసేంత క్రేజ్‌ ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉండగా మరి కొందరు మాత్రం ఆమె బిజినెస్‌ ఐడియా అభినందనీయం అంటున్నారు.
Tags:    

Similar News