సిట్టిబాబు మాటలు సూపర్

Update: 2018-05-12 05:51 GMT
చేసిన సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అదే రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడితేనే.. బ్లాక్ బస్టర్ పడితేనో ఇంకా ఆనందం. నా సినిమా హిట్ కొడితే ఆనందమే. ఇండస్ట్రీ లాభాల్లో ఉంటే అంతకన్నా ఆనందం ఉండదంటున్నాడు చిట్టిబాబు.. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ సమ్మర్ లో రిలీజైన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు.

80ల నాటి పల్లెటూరి కథతో వచ్చిన రంగస్థలం మూవీలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కంటిన్యూగా వసూళ్లు సాధించింది. దీని తరవాత మహేష్ బాబు మూవీ భరత్ అనే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది.  దాంతో ఈ రెండు సినిమాల కలెక్షన్ల మధ్య తరచూ పోలిక వస్తూనే ఉంది. దీనిపై రామ్ చరణ్ చాలా హుందాగా రెస్పాండయ్యాడు. ‘‘మహేష్ నేను మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి సినిమాలు సక్సెస్ కావడంతో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఎవరి సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయంటూ లెక్కలేసుకుంటూ పోటీ పడుతున్నామని ఇప్పటికి బోలెడు రూమర్లు వచ్చాయి. అవన్నీ పనిలేని వాళ్లు చేస్తున్న పనులే’’ అంటూ రామ్ చరణ్ కొట్టిపారేశాడు.

‘‘ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో డివైడ్ అండ్ రూల్ పాలసీ కరెక్ట్ కాదు. మేం ఎవరి పని వాళ్లం చేసుకుంటున్నా అంతా కలిసికట్టుగానే ఉంటాం. ఇక్కడ సాధించే లాభమంతా ఇండస్ట్రీ మంచికే ఉపయోగపడుతుంది. అందుకే ఒక్కరి సక్సెస్ కన్నా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవడమే కరెక్ట్’’ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.



Tags:    

Similar News