సంక్రాంతి బరిలో పుంజులు నువ్వా నేనా? అంటూ తలపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. బన్ని నటిస్తున్న అల వైకుంఠపురములో .. ఈ రెండిటి మధ్యా హోరాహోరీ సాగుతోంది. ఈ సినిమాల ప్రచారం అభిమానుల్లో వేడెక్కిస్తోంది. ముఖ్యంగా లిరికల్ సాంగ్స్ తో ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుండడంతో మ్యూజిక్ ఆల్బమ్స్ విషయంలోనూ ఎవరి ప్రత్యేకత ఎంత? అన్న ఆరాలు మొదలయ్యాయి. సరిలేరు.. అల వైకుంఠపురములో సంగీతం మధ్య పోలికల్ని ఫ్యాన్స్ చూస్తుండడం వార్ కి తెరలేపింది. దాంతో దేవీశ్రీ- థమన్ మధ్య ఊహించని పోటీకి అది ఆజ్యం పోస్తోంది.
ఇక ఇప్పటికే అల వైకుంఠపురములో పాటలకు స్పందన బావుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజై అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ప్రతి సోమవారం మాస్ ఎంబీ లిరికల్ సాంగ్ ట్రీట్ ని రెడీ చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా గత సోమవారం `మైండ్ బ్లాక్` సాంగ్ రిలీజై... మాస్ బీట్ తో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. దీనికి శ్రోతల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
ఆ క్రమంలోనే రెండో లిరికల్ సాంగ్ విషయంలో దేవీశ్రీ బృందం చాలానే జాగ్రత్తలు తీసుకున్నారట. నేడు(9డిసెంబర్) సెంటిమెంటు ప్రకారం 5: 04 పీఎం (9 సెంటిమెంట్)కి ఈ రెండో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్. దీనికి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. `సూర్యుడివో చంద్రుడివో`.. అంటూ సాగే ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగర్ బి ప్రాక్ ఆలపించారు. మహేష్ ఫేవరెట్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మైండ్ బ్లాక్ సాంగ్ కి మిశ్రమ స్పందనలు వచ్చినా.. ఈ రెండో లిరిక్ కి మాత్రం అలాంటి స్పందన రాదని చిత్రబృందం అంచనా వేస్తోంది.
ఇక ఈ పాటను ప్రతిభావంతుడైన ప్రాక్ ఆలపించడం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఫిల్హాల్ చిత్రంలో ప్రాక్ పాడిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అందుకే అతడు పాడిన ఈ మెలోడీ పైనా అంచనాలేర్పడ్డాయి. ఇక ఈ పాటతోనే ప్రాక్ సౌత్ లో అడుగుపెడుతున్నాడు. ఇది క్లిక్కయితే ఇకపైనా దేవీశ్రీ.. థమన్ సహా సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి అతడు అవకాశాలు అందుకోవడం గ్యారెంటీ.