మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు లో సీతారామం సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా సందడి ముగిసిందో లేదో వెంటనే హిందీలో తాను నటించిన చుప్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ యొక్క పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
చుప్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ ఖాన్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. వరుసగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సందర్భాల్లో తన తండ్రి మమ్ముట్టీ యొక్క విషయాలను కూడా పంచుకున్నాడు.
తన తండ్రి కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న విమర్శల గురించి ప్రధానంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చిన్నతనంలో మా నాన్న సినిమా లు చూసిన సమయంలో చాలా బాగా అనిపించేవి. అయినా కూడా వాటికి కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తూ కామెంట్స్ చేసేవారు. సినిమా బాగున్నా కూడా ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కాకపోయేది. నా వయసు చిన్న అవ్వడం వల్ల ఆ ప్రశ్నలకు నాకు సమాధానం అర్థం అయ్యేది కాదు.
అప్పట్లో విమర్శించిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కానీ వారి యొక్క విమర్శలు కూడా మెల్లగా మారుతూ ఉంటాయని అప్పుడే తెలుసుకున్నాను. 2012 మరియు 2013 సంవత్సరాల్లో నన్ను ప్రభావితం చేసిన వారు ఇంకా నన్ను ప్రభావితం చేస్తున్నారని నేను అనుకోను అన్నడు.
హీరోగా దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రలు ఆయన స్థాయిని మెల్ల మెల్లగా పెంచుతూనే ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కింది. కెరీర్ ఆరంభంలో విమర్శలు ఎదుర్కొన్నా.. ట్రోల్స్ ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు మాత్రం తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని స్టార్ గా దుల్కర్ నిలిచాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.