ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ కోసం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం నెలకొన్న కరెన్సీ సంక్షోభంను పట్టించుకోకుండా.. ధైర్యంగా ఈ నెల 18న థియేటర్లలోకి వస్తున్న ఈ థ్రిల్లర్ పై ఇండస్ట్రీ ఎదురుచూపులు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే.. మూవీపై మేకర్స్ ఎందుకంత నమ్మకం పెట్టుకున్నారనే విషయం అర్ధమవుతుంది. ఫస్ట్ లుక్ నుంచి డిఫరెంట్ విజువల్స్ తో ఆకట్టుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా.. థియేట్రికల్ ట్రైలర్ తో కుమ్మేశాడని చెప్పాలి.
ఫస్ట్ ఫ్రేమ్ లోనే రైలు పట్టాల మధ్యలో నుంచుని అటు తిరిగి ఉన్న అమ్మాయి లుక్ ని సూపర్బ్ గా చూపించగా.. ఆత్మలంటే నమ్మకం లేని హీరో.. చివరకు దాని కారణంగా ప్రాణం కోసం పరిగెట్టాల్సి రావడం.. ప్రపంచంలో ఎక్కడికెళ్లిన వెంటాడి దూల తీర్చేస్తుందని ఫ్రెండ్ చెప్పడం.. కేరళలోని మహిషాసుర మర్దనీ ఆలయానికి వెళ్లాలని ఓ మంత్రగాడు సలహా ఇవ్వడం.. అక్కడి నుంచి హీరో పడే పాట్లు.. అందంగానే భయపడుతున్న హీరోయిన్ హేభా పటేల్.. ప్రతీ విజువల్ ఇరగదీసేసింది.
ట్రైలర్ తోనే సినిమాని తప్పకుండా చూడాలనే ఇంప్రెషన్ కలిగించేసింది చిన్నవాడి టీం. ఈ ట్రైలర్ ఇంత అద్భుతంగా కట్ చేసిన ఎడిటర్ ని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుందేమో. ఆత్మ బరువు మరి 21 గ్రాములు అంటూ ఆసక్తి కలిగించిన ఈ సినిమా రిజల్ట్ కోసం.. టాలీవుడ్ ఎదురుచూపులకు ఎలాంటి ఆన్సర్ లభిస్తుందో!
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/