బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ఒకవైపు.. వివాదాలు మరోవైపు ఇషాగుప్తాని నిరంతరం హెడ్ లైన్స్ లోకి ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు నైజీరియన్ ఫుట్ బాల్ ప్లేయర్ పై ఊహించని కామెంట్ చేసి వివాదాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ రెస్టారెంట్ యజమాని తనని సోషల్ మీడియాల్లో వెంబడించి కించపరిచాడని వివాదం రాజేసింది.
ఇటీవల వివాదాలు సద్దుమణిగాయి అనుకుంటే ఇప్పుడు ఇషా గుప్తా స్టైల్ స్టేట్ మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వీటన్నిటికీ కాంట్రాస్ట్ గా ఇషా గుప్తా ఫిట్నెస్ యోగా భంగిమలపైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఇషా కొన్ని సంక్లిష్ఠమైన యోగా భంగిమల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసి దానికి ఆసక్తికర కామెంట్ ని జోడించారు. ఇషా గుప్తా కాదు ఎలాస్టిక్ గుప్తా అని పిలవాలి అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
`బెక్ హామ్`(ఫుట్ బాల్ స్టార్)ని మరిచిపోయి ఇషాగుప్తాలా బెండ్ అవ్వండి..!! అంటూ వ్యాఖ్యను జోడించింది. ఇషా ప్రాక్టీస్ చేస్తున్న ఈ యోగాసనాలు చాలా క్లిష్ఠమైనవి. కేవలం గురువుల సమక్షంలో మాత్రమే చేయాల్సినవి. ఆమె కవ్వించిందని అలాంటి ప్రయత్నాలు చేస్తే అది ప్రమాదకరం..! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల ఇషా గుప్తా సుందరమైన ప్రకృతి దృశ్యంతో పాటు పంజాబ్ లోని అద్భుతమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసింది. వీడియోను పంచుకున్నా.. ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా వెల్లడించలేదు. ఇషా గుప్తా తన లేటెస్ట్ సింగిల్ చిత్రీకరణ కోసం పంజాబ్ వెళ్లారని తెలిసింది.
తన తొలి వెబ్ షో `రిజెక్ట్ ఎక్స్` తరువాత ఇషా ఇప్పుడు సింగిల్ తో అభిమానుల ముందుకు రానుంది. ఇటీవల తాను బాధాకరమైన ఎసిఎల్ గాయం నుంచి కోలుకున్నానని తనకు ఆసక్తిని కలిగించి ఆకర్షించే బలమైన పాత్రల కోసం చూస్తున్నానని వెల్లడించింది. మోకాలి గాయం నుండి కోలుకోవడానికి ఈషా ఆమె సంపాదించిన డబ్బు అంతా ఖర్చు చేసిందట. ఎసిఎల్ (పూర్వ క్రూసియేట్ లిగమెంట్) గాయం చాలా చెడ్డదని తెలిపింది.
రిజెక్ట్ ఎక్స్ షో కాకుండా గుప్తాజీ చివరిసారిగా `వన్ డే: జస్టిస్ డెలివర్డ్` అనే OTT చిత్రంలో కనిపించింది. ఆమె క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ లక్ష్మి రతి పాత్రను పోషించింది. అశోక్ నందా దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రంలో అనుపమ్ ఖేర్- కుముద్ మిశ్రా- అనుస్మృతి సర్కార్ కూడా నటించారు. ఇషా గుప్తా తదుపరి రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నారు. దేశీ మ్యాజిక్ - హేరా ఫేరి 3 లలో కనిపించనుంది.