ట్రోలింగ్ కల్చర్ కూడా మన హీరోల కు కావాల్సిననంత ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది. పాజిటివా నెగిటివా అన్న విషయాన్ని పక్కన బెడితే ట్రోలింగ్స్ ద్వారా ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ దగ్గరవుతున్నారు. ఆ మధ్య డైలాగ్ కింగ్ మోహన్ బాబుని ఫసక్ విషయంలో నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. ఆ విషయాన్ని మోహన్ బాబు కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఇంకా చాలా మంది అగ్ర హీరోలు ట్రోలర్స్ భారిన పడిన పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న నటసింహ బాలకృష్ణ కొత్త గెటప్ లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఫ్రెంచ్ లుక్ లో టాలీవుడ్ హీరోలకే కొత్త ట్రెండ్ ని పరిచయం చేసారు. క్యారెక్టర్ పరంగా ఆ లుక్ లో బాలయ్య ఎలా ఉన్నారు? అన్నది హాట్ డిబేట్ కి తెర తీసింది. ఆ న్యూ లుక్ కోసం ఆయన ఎంతో శ్రమించాడు. ఆ లుక్ ని కూడా నెటిజనులు వదిలి పెట్ట లేదు. సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్స్ చేస్తున్నారు. బాలయ్య ఆ లుక్ లో టోనీ స్టార్క్ (ఐరన్ మ్యాన్) లా ఉన్నాడని కొందరు లేదు విజయ్ మాల్యాలా ఉన్నాడని మరికొందరు.. రకరకాలుగా పోల్చేస్తుంటే.. అది పొగడ్తనా లేక తెగడ్తనా అర్థం కాకుండా పోతోంది. కంపారిజన్ తో ట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఇక నందమూరి అభిమానులు టోనీ స్టార్క్ అని పొగిడేస్తున్నారంటే అది వాస్తవిక అభిమానమే కానీ.. ఇతర హీరోల ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్లు చేస్తే అది నెగెటివ్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా దీని గురించి బాలయ్య కొన్ని ఆసక్తి కరంగా స్పందించారు.
సమరసింహారెడ్డి రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు జయప్రకాశ్ రెడ్డి ని వీర రాఘవరెడ్డి అని పిలిచేవారు. ఆ పాత్ర ఆయనకు ఇచ్చిన గుర్తింపు అది. తర్వాత నటి జయలలిత ను లారీ డ్రైవర్ చిత్రంతో `బోరింగ్ పాప` గా ప్రేక్షకుల్లో ఫేమస్ అయ్యారు. అది అభిమానులు ఆమె చూపించిన ప్రేమ. ఇప్పుడు అందరూ నన్ను నందమూరి టోనీ స్టార్క్ అని పిలుస్తున్నారు. ఇది వారికి నా పై ఉన్న ప్రేమ.. అభిమానం అని బాలయ్య అనడం విశేషం. రూలర్ కి కె. ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పోటీగా సాయి తేజ్ ప్రతిరోజూ పండగే.. సల్మాన్ ఖాన్ దబంగ్ 3 చిత్రాలు రిలీజవుతున్నాయి.