సమ్మర్ వేడి అంతకంతకు పెరుగుతోంది. మార్చి మిడిల్ లోనే మంటలు ఉక్కపోత మొదలైంది. ఇలాంటి టైమ్ లో ఓన్లీ కాటన్ అంటూ కొందరు కేవలం అరవింద్ కాటన్ దుస్తులకు ప్రయారిటీ ఇస్తుంటారు. ఇక వేసవి మొదలైంది అంటే సమ్మర్ సెలక్షన్స్ పేరుతో కొత్త మోడల్ దుస్తులు మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. అలా వచ్చిన వాటికి ఇదిగో ఇలా సెలబ్రిటీలు ప్రచారార్భాటం చేస్తుంటారు. ఈసారి సమ్మర్ సమ్మక్కలు సారక్కలు ఎవరై ఉంటారు? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
బాలీవుడ్ ముగ్ధలు .. కత్రినా కైఫ్ టు అలియా భట్ ఈ కొత్త కలెక్షన్స్ పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. వేసవి లేదా వసంతరుతువులో పూల ముద్రణతో పాటు.. పసుపు- నారింజ- పింక్- నీలం వంటి ప్రకాశవంతమైన రంగులు ఎలక్ట్రి ఫైయింగ్ గా కనిపిస్తాయట. సమ్మర్ షేడ్స్ గా ఈ రంగులు పాపులర్. ఇక రకరకాల షేడ్స్ తో పాస్టెల్ రంగు దుస్తులు బాగా గాలి వీచేలా రూపొందిస్తారట డిజైనర్స్. అలియా భట్ నుండి టేలర్ స్విఫ్ట్ వరకు అందరూ ఈ రంగు దుస్తుల్ని ఇష్టపడతారు.
అలియా భట్ ఆహ్లాదకరంగా సింపుల్ గా ఉండే వేసవి దుస్తులను ఎంపిక చేసుకుంటుంది. తన నడుము చుట్టూ టైతో కొంత షేప్ తెస్తూనే.. పసుపు స్టిలెట్టోస్ తో స్టైలింగ్ చేసిన డిజైనర్ డ్రెస్ ని తొడుక్కుంది. ఈ దుస్తులలో ఆలియా స్పైసీగా అందంగా కనిపిస్తోంది. కత్రినా కైఫ్ .. మరింత ఆకర్షణీయమైన .. ఓవర్ ది టాప్ అనిపించే పూల ముద్రణల లిలక్ గౌనును ధరించింది. కత్రినా కైఫ్ స్లీవ్ లెస్ ని ఇష్టపడుతుంది. ఒక భుజం స్లీవ్ మీద విల్లు ట్రిక్ చూశారుగా..! స్టైలింగ్ లో కత్రినాను మించి కనిపించడం కష్టమే. మరో టాప్ బ్యూటీ కియారా అద్వానీ ఫ్యాషనిస్టాగా చెలరేగుతోంది. ఈ భామ ఇటీవల బ్రంచ్ కెళ్లింది. అక్కడ లుక్ కోసం లిలక్ టాప్ వైట్ ఫ్లేవర్డ్ ప్యాంటుతో కనిపించింది. వేసవికి సరిపడే వస్త్రధారణకు షిఫ్టయింది ఈ భామ.
జాన్వి కపూర్ .. సీక్విన్ చీరను చూశారా? గుండె జిల్లంటోంది కదూ? మొత్తానికి దేశీ అమ్మాయిలా కనిపించాలి! అలంకరించబడిన చెవిపోగులు .. నిగనిగలాడే మేకప్.. రెడ్ కార్పెట్ నడకల నుండి పూజగదిలో పూజకు రెడీ అయ్యేవరకూ డిపరెంట్ గెటప్పుల్లో కనిపిస్తుంది ఈ అమ్మడు. ఇక జిమ్ కి వెళితే పక్కా స్పోర్ట్స్ డ్రెస్ రూల్ ని పాటిస్తుంది. ఆలయ .. ఈ కొత్తమ్మాయ్.. ప్రస్తుతం ట్రెండింగ్ బ్యూటీ. జవానీ జానెమాన్ చిత్రంలో నటించాక యూత్ ఈ అమ్మడిని ఫాలో చేస్తున్నారు. అలయ ఇటీవల ఒక కాక్ టెయిల్ పార్టీకి లిలక్ నంబర్ ను ఎలా యూజ్ చేయాలో చూపించింది. అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ .. రెడ్ కార్పెట్ లుక్ కోసం షేడెడ్ డిజైన్లను ఎంపిక చేసుకుంది. ఈ స్టయిల్ ని కుర్రకారు విపరీతంగా అనుసరించాలని భావిస్తారట.