#F3 ఫ్ర‌స్టేష‌న్ వ‌దిలి హోలీ న‌వ్వులు తెచ్చారయా!

Update: 2022-03-18 07:34 GMT
ఎఫ్ 3 టీమ్ నేడు హోలీని పుర‌స్క‌రించుకుని త‌మ అభిమాన దేవుళ్ల‌కు హోలీ శుభాకాంక్ష‌ళు తెలియ‌జేసింది. రంగుల‌ హోలీలా మీ జీవితాలు చాలా సంతోషంగా సాగాల‌ని టీమ్ విషెస్ తెలిపింది. వెరీ హ్యాపీ అండ్ సేఫ్ హోలీ అంటూ ప్ర‌త్యేకించి ఓ వీడియోని టీమ్ రిలీజ్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. వీడియో ఆద్యంతం తార‌ల‌తో పాటు ద‌ర్శ‌కుడు క‌నిపించారు. ఆన్ లొకేష‌న్ ఎంత‌గా ఫ‌న్ పండిందో ఈ వీడియో చెబుతోంది. ఎఫ్ 3 మే 27న గ్రాండ్ గా విడుద‌ల కానుంది.

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్ .. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప‌క్కాగా రెడీ అవుతున్నారు. హనీ ఈజ్ ది బెస్ట్ అంటారో.. మిల్కీ ఈజ్ ది బూస్ట్! అనేస్తారో కానీ డ‌బుల్ ట్రిపుల్ కామెడీని ఫ‌న్ ని ఈ సినిమా నుంచి ఆడియెన్ ఆశిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే వెంకీ - వ‌రుణ్ బోలెడంత ప్రిప‌రేష‌న్ తో ఉన్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చ‌త్రాన్ని నిర్మిస్తుండగా.. బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్ టైనర్ F3లో ట్రిపుల్ ది ఫన్ ను అందించనున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించడానికి F3ని తేనున్నారు. ఇటీవ‌ల అనీల్ రావిపూడి టీమ్ సెట్స్ లో బిజీగా గ‌డిపి టాకీని పూర్తి చేసింది. డబుల్ బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 ఫ్రాంచైజీలో రెండో చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్త‌వుతున్నాయి. ట్రేడ్ సర్కిల్స్ లో ఇప్ప‌టికే పాజిటివ్ బజ్ ని కలిగి ఉంది. సామాన్యుల నుండి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వ‌ర‌కూ భారీ అంచనాలు ఉన్నందున మేకర్స్ క్రమం తప్పకుండా అప్ డేట్ లను అందిస్తున్నారు. ఎఫ్ 3 చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.

వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా గ్లామ‌ర్ కంటెంట్ మ‌రో లెవ‌ల్ ని తాక‌నుంద‌ని స‌మాచారం. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఫుల్ ఫ‌న్ తో బోలెడంత‌ నవ్వించే పాత్రలో కనిపించనున్నారు. గ్లామర్ జోడించడానికి సోనాల్ చౌహాన్ మూడవ నటిగా ఎంపిక చేయగా.. సునీల్ వినోదభరితమైన పాత్రలో క‌నిపించ‌నున్నాడు. కాబట్టి F3 వినోదం- గ్లామర్ మేళ‌వింపుతో ఇతర వాణిజ్య అంశాల కలయికగా ఉంటుంది.

ఎఫ్ 2కి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎఫ్3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్ ని రెడీ చేస్తున్నాడు. సాయి శ్రీరామ్ కెమెరా వ‌ర్క్ అందిస్తుండ‌గా.. తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ- నారా ప్రవీణ్.

బ్యాక్ టు బ్యాక్ క్రేజీ లైన‌ప్
గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ ని అందించాడు అనీల్ రావిపూడి. ఎఫ్ 3 షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో విడుదల చేయనున్నారు. కమల్ హాసన్ క్లాసిక్ సతీలీలావతిని రీమేక్ ఆలోచ‌న అనీల్ రావిపూడికి ఉంద‌ని తెలిసింది. దాంతో పాటే బాల‌య్య బాబుతో అత‌డు సినిమా చేయాల్సి ఉంది.  త‌న వ‌ద్ద ఉన్న రెండు స్క్రిప్ట్ లలో ఒక‌టి చేయాలా?  లేక ఇంకేం చేయాలి? అన్న‌ది తొంద‌ర్లోనే ఖ‌రార‌వుతుంది. రావిపూడి తదుపరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించనుంది.


For Video >> https://twitter.com/hashtag/F3Movie?src=hashtag_click
Tags:    

Similar News