బిగ్ బాస్: నాగార్జున బోర్.. జూ.ఎన్టీఆర్ రావాలట

Update: 2021-09-06 06:39 GMT
బిగ్ బాస్: నాగార్జున బోర్.. జూ.ఎన్టీఆర్ రావాలట
  • whatsapp icon
బిగ్ బాస్ తెలుగు సీజన్5 నిన్న ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.  టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున హోస్ట్ గా అదరగొట్టాడు. ఫస్ట్ షోలోనే అంచనాలు పెంచేశాడు.  బిగ్ బాస్ హౌస్ లోకి ప్రేక్షకులను లీనం చేవాడు. సీజన్ 5లో మొత్తం 19 కంటెస్టెంట్లను ఒక్కరొక్కరు గా పిలిచి హౌస్ లోకి పంపించాడు.

హోస్టింగ్ విషయంలో అక్కినేని నాగార్జున సరికొత్త రికార్డ్ సృష్టించినట్టైంది. హోస్ట్ గా ఆయనకు ఇది మూడో సీజన్. బిగ్ బాస్ ఫస్ట్ షోను జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ ను నాని చేశాడు. 3,4,5వ సీజన్ లను నాగార్జున నడిపిస్తున్నారు.

మూడో ఏడాది కూడా వరుసగా హోస్ట్ చేసిన నాగార్జున ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షోకు ప్రధాన ఆకర్షణగా మారాడు. ఎప్పటికప్పుడు సందర్భానుసారం స్పందిస్తూ తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు.

హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అవుతున్నప్పటికీ ఆయన మీద కొంత వ్యతిరేకత నెలకొన్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభం నుంచే కొంత ప్రతికూల గాలి అనేది వీస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జునకు బదులుగా జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ హోస్ట్ గా తీసుకొని రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రత్యేకించి దీనిపై సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు.  నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ లా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోతున్నారని అభిమానులు అంటున్నారు. ఇదే విషయంపై డిబేట్ ను మొదలుపెట్టారు. నాగార్జున హోస్టింగ్ బోర్ కొడుతోందని అంటున్నారు.

బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభంలోనే దానికి స్పందన ఈసారి అంతగా కనిపించడం లేదు. నెగెటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ సీజన్ ముగిసే సమయానికి మరింత ఉధృతంగా ఇదే మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా ఎన్టీఆర్ కూడా జెమినీటీవీలో చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి పెద్దగా స్పందన కనిపించడం లేదు. అంత గొప్పగా ఏం లేదని కామెంట్లు వినపడుతున్నాయి. టీఆర్పీలోనూ తేలిపోయిందని అంటున్నారు.  ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిందని ఏహీరో వచ్చినా కంటెంట్ ఉంటేనే చూస్తున్నారని అంటున్నారు.
Tags:    

Similar News