లైక్‌ షేర్‌ అంటున్న జాతిరత్నాలు ముద్దుగుమ్మ

Update: 2022-10-29 05:35 GMT
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్స్క్రైబ్. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ కి జోడీగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించింది. ఆ సందర్భంగా పలు విషయాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ... లైక్ షేర్ & సబ్స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకు చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. ఇందులో  ప్రతి పాత్రకు ఒక నేపథ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది. ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర నాది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది.

జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది.

40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. 'చిట్టి' పాత్రని అందరూ అభిమానించారు. ఈ విషయం లో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వంద శాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.

ప్రస్తుతం తమిళంలో సుసీంధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరో గా ఒక సినిమా చేస్తున్న. సుసీంధిరన్ గారు ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పక్కాగా వుంటానని వారు చెప్పడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది.

అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి. రవితేజ రావణాసుర, ఒక తమిళ్ మూవీ, ఒక హిందీ సిరీస్ చేస్తున్నా. నాకు ఆర్ట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం. అలాగే మ్యూజికల్ ఫిలిమ్స్ కూడా ఇష్టం. అయితే దర్శకత్వం ఇప్పుడు కాదు.. మరో పదేళ్ళు పడుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News