రేసుగుర్ర‌మంటి స్పీడున్న‌ ఫ‌రియా నెక్ట్స్ ఏంటి?

Update: 2021-05-14 15:30 GMT
జాతి ర‌త్నాలు చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఫ‌రియా అబ్ధుల్లా తొలి ప్ర‌య‌త్న‌మే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇండ‌స్ట్రీలో స్వీటీ అనుష్క త‌ర్వాత అంత ఎత్తు ఉన్న ఏకైక బ్యూటీగా ఫరియా పేరు మార్మోగుతోంది. డార్లింగ్ ప్ర‌భాస్ అంత‌టి వాడే ఈ అమ్మ‌డి ఎత్తు చూసి స్ట‌న్న‌యిపోయాడు.

పూజా హెగ్డే.. కృతి శెట్టిని మించిన ఎత్తు ఉన్న ఈ బ్యూటీ అందచందాల్లోనూ ఏమాత్రం త‌క్కువ కాదు.  తీరైన రూపం అంద‌మైన న‌వ్వు.. రింగుల జుత్తు ఫరియాకు అద‌న‌పు హంగులు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీపై టాలీవుడ్ హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఫోక‌స్ ఎక్కువ‌గానే ఉంద‌ని స‌మాచారం.

ఇక ఫ‌రియా సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. తాజాగా ఫ‌రియా డార్క్ మేక‌ప్ లుక్ ఎంతో ఆక‌ర్షించింది. స‌హ‌జ‌సిద్ధ‌మైన త‌న అందాన్ని హైలైట్ చేస్తూ ఫ‌రియా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. వీటిలో డార్క్ హార్స్ తో ఫ‌రియా ఫోజులు సంథింగ్ స్పెష‌ల్ అన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బ్రౌన్ హార్స్ ని హ‌గ్ చేసుకుని బ్లాక్ ఫ్రాక్ ఫ‌రియా ఓ రేంజులోనే మ్యాజిక్ చేస్తోంది. ప్ర‌స్తుతం యువ‌త‌రం సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. రేసుగుర్ర‌మంటి స్పీడున్న‌ ఫ‌రియా నెక్ట్స్ ఏంటి? అన్న ప్ర‌శ్న‌కు త‌నే స‌మాధాన‌మిస్తుందేమో కాస్త ఆగాలి.
Tags:    

Similar News