షాక్‌: ఏ.ఆర్‌.రెహ‌మాన్ పై ఫ‌త్వా

Update: 2015-09-11 16:06 GMT
ముస్లిముల మ‌నోభావాల్ని కించ‌ప‌రిచేలా సినిమాలు తీయ‌డం, అటుపై అవ‌న్నీ నిషేధాజ్ఞ‌ల‌కు గుర‌వ్వ‌డం ఇదంతా నిరంత‌రాయంగా చూస్తున్న‌దే. ఇటీవ‌లే సైఫ్‌ ఆలీ ఖాన్ ఫాంట‌మ్ సినిమాని కొందరు పాకిస్తాన్ ముస్లిములు వ్య‌తిరేకించారు. అయితే అది మ‌త‌త‌త్వానికి సంబంధించినది కాక‌పోయినా పాకిస్తానీల‌కు వ్య‌తిరేకంగా తీసిన సినిమాగా ముద్ర ప‌డింది. గ‌తంలోనూ షారూక్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్‌, అక్ష‌య్‌కుమార్ లాంటి హీర‌ల‌కు ఇలాంటి థ్రెట్ త‌ప్ప‌లేదు. అయితే ఇది అందుకు భిన్న‌మైన స‌మ‌స్య‌.

ఆస్కార్ గ్ర‌హీత‌, ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్‌కి, నిర్మాత మాజిదీకి ముంబైకి చెందిన సున్నీ ముస్లిమ్ గ్రూప్ రెజా అకాడమీ ఫ‌త్వా జారీ చేసింది. ఓ సినిమా కో్సం రూల్‌ని అతిక్ర‌మించి మ‌తాన్ని అప‌విత్రం చేస్తున్నారంటూ ఈ ఫ‌త్వా లేఖ‌ను రాజ‌కీయ‌నేత‌ల‌కు అందించారు. ముహ‌మ్మ‌ద్ :  మెసెంజ‌ర్ ఆఫ్ గాడ్ -ఫ‌స్ట్ ఆఫ్ ది ట్ర‌యాల‌జీ .. ప్రాఫెట్ మ‌హ‌మ్మ‌ద్ పై తీస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాని మాజిది నిర్మిస్తున్నారు. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.  మాజిది, రెహ‌మాన్ ముస్లిము సోద‌రులే అయినా ఈ సినిమాపై పున‌రాలోచించుకోవాల‌ని అల్టిమేట‌మ్ జారీ చేశారు.

హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, మ‌హారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ఇద్ద‌రికీ ఓ లేఖ అందింది. మాజిదీ ఫిలింని బ్యాన్ చేయండి.. ఇందులో అభ్యంత‌ర‌క‌ర‌మైన‌వి ఉన్నాయి. ప్రాఫెట్ అనే ప‌దాన్ని క‌లుషితం చేసేస్తున్నారు. ఇందులో ముస్లిములు కాని వాళ్లు కూడా నటించడం మాత్రమే కాదు, అసలు ప్రొఫెట్‌ పై ఒక సినిమాను తీయడమే అతి పెద్ద తప్పు.. రెజా అకాడెమీ పంపించిన లేఖ‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News