'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక - కలైరసన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ''ఫియర్''. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మైమ్ గోపి - జయబాలన్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ సరికొత్తగా ప్రారంభించబడిన స్పార్క్ ఓటీటీలో 'ఫియర్' సినిమాని స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
'కొన్నిసార్లు నిజం అనేది కల్పన కంటే స్ట్రేంజ్ గా ఉంటుంది' అంటూ 'ఫియర్' టీజర్ ప్రారంభమైంది. 'ఒక హత్యను క్రైమ్ గా కాకుండా ఆర్ట్ లా చూసే వ్యక్తి కథ' అని చెబుతూ సినిమాపై ఆసక్తిని కలిగించారు. తన కథలు ఔట్ డేటెడ్ గా ఉంటున్నాయని బాధ పడే ఓ ఫిక్షనల్ రైటర్.. ఓ కొత్త థ్రిల్లర్ కథ రాయడానికి ఒక హిల్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత, అక్కడ అతను ఎదుర్కొన్న భయానక సంఘటనలు ఎంటనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా భయం ఉన్న ఈ గ్రిప్పింగ్ టీజర్ ఆకట్టుకుంటోంది.
జోహన్ షెవనేష్ అందించిన నేపథ్య సంగీతం భయాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ప్రసన్న ఎస్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శాన్ లోకేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. అక్షయ శ్రీ సమర్పణలో హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి. శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఫియర్' ట్రైలర్ ను రేపు (జూన్ 11) విడుదల చేయనున్నారు. స్పార్క్ ఓటీటీలో జూన్ 12వ తేదీ నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Full View