దీపావ‌ళికి థియేట‌ర్లు మోతెక్క‌డం ఖాయ‌మే!

Update: 2022-10-05 11:30 GMT
పండ‌గ‌ల సీజ‌న్ సినిమా రిలీజ్ కి ఎంత కీల‌క‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి సీజ‌న్లు టార్గెట్ చేస్తే సినిమా యావ‌రేజ్ గా ఉన్నా! వ‌సూళ్ల ప‌రంగా బండి లాంగిచేయోచ్చు అన్న‌ది ఓ అంచ‌నాగా చాలా మంది నిర్మాత‌లు భావించి ఈ సీజ‌న్ల‌లో రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు. సినిమా నిజంగా హిట్ అయితే నిర్మాత‌ల‌కు అస‌లు పండ‌గ‌ని మించిన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.

ఈ ద‌స‌రాకి `ఘోస్ట్`.. `గాడ్ ఫాద‌ర్` స‌హా ప‌లు సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయా సినిమాల‌కు పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ సీజ‌న్ వాటికి క‌లిసొస్తుంద‌ని తెలుస్తోంది. అలా 2022 ద‌స‌రా ముగిసింద‌ని చెప్పొచ్చు. ఇక ముందున్న అతి పెద్ద పండ‌గ దీపావాళి. అక్టోబ‌ర్ 24న పండ‌గ‌. ఈ సీజ‌న్ కి భారీగానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఈ నేప‌థ్యంలో అప్పుడే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ల‌ని లాక్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  తమిళ- తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న `ప్రిన్స్`  దీపావళికి ఫిక్సయింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా `జాతిర‌త్నాలు` ఫేం   అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ముఖ్యంగా తెలుగు మార్కెట్ ని  టార్గెట్ చేసి రిలీజ్ చేస్తోన్న సినిమా ఇది.

ఈ నేప‌థ్యంలో  భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే యంగ్ హీరో విశ్వక్సేన్ సినిమా `ఓరి దేవుడా` కూడా దీపావళి రేసులో ఉంది. దీవాలీకి మూడు రోజుల ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్  చేస్తున్నారు. మ‌రోవైపు  మంచు విష్ణు   `జిన్నా` అంటూ దూసుకొస్తున్నాడు. అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. దాదాపు ఈ సినిమాల‌న్నీ దివాలీ  టార్గెట్ గానే రిలీజ్ అవుతున్నాయి.

ఇంకా  నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంతోష్ శోభ‌న్-మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టిస్తోన్న `అన్నీ మంచి శ‌కున‌ములే` దివాలీకే వ‌స్తుంద‌ని స‌మాచారం. అలాగే ద‌గ్గుబాటి వార‌సుడు.. నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు అభిరాం హీరోగా లాంచ్ అవుతోన్న  `అహింస` ని కూడా దీపావ‌ళికి వ‌దిలేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంపై అం చ‌నాలు బాగానే ఉన్నాయి. అభిరాం..తేజ యాటిట్యూడ్ కి ద‌గ్గ‌ర‌గా ఈ సినిమా ఉంటుంద‌ని ఇండస్ర్టీ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రోవైపు కోలీవుడ్ హీరో కార్తి  కొత్త చిత్రం `స‌ర్దార్‌`ను ఈ పండ‌క్కే   ఫిక్స్ చేసారు. ఇంకా కొన్ని చిన్న చితకా సినిమాలు స‌హా ప‌లు త‌మిళ అనువాద చిత్రాలు దివాలీ రేసులో ఉన్నాయి. ఇవ‌న్నీ ఒకేసారి రిలీజ్ అయితే థియేట‌ర్ల స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయినా త‌గ్గేదేలే అంటూ ఎవ‌రికి వారు ధీమాగా వ‌చ్చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News