టాలీవుడ్ లో ఇప్పడు ఏ హీరోని కదిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాన్ ఇండియా. తమ సినిమాలని ఆపణ్ ఇండియా లెవెల్లో విడుదల చేసి తమ మార్కెట్ ని భారీగా పెంచుకోవాలని ప్రతీ హీరో ప్లాన్ లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పాన్ ఇండియా వైడ్ గా తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నారు. 'రాధేశ్యామ్' తో ఇటీవల పాన్ ఇండియా చిత్రాల హంగామా మళ్లీ మొదలైంది. రీసెంట్ గా విడుదలైన 'ట్రిపుల్ ఆర్' తరువాత వరుసగా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇందులో క్రేజీ కాంబినేషన్ లు, స్టార్ డైరెక్టర్ లు.. భారీ బడ్జెట్ లతో చేసిన చిత్రాలే ఎక్కువగా రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'రాధేశ్యామ్' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అంతా తాజా చర్చకు తెరలేపారు. ఎన్నివున్నా కంటెంటే కింగ్ ఇక్కడ..అది లేదంటే.. ప్రేక్షకులు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేస్తున్నారు. బిగ్ స్టార్స్ వున్నా.. వందల కోట్లు బడ్జెట్ ని కుమ్మరించినా.. గ్రాండియర్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేయాలని ప్రయత్నాలు చేసినా సరైన కంటెంట్ లేకపోతే అవేవీ ప్రేక్షకుల ముందు పనిచేయడం లేదు. కంటెంట్ వుంటే వందల కోట్ల బడ్జెట్.. గ్రాండీయర్ విజువల్స్ ఆయా చిత్రాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తోందే కానీ కంటెంట్ లేని సినిమాలని కాపాడటం లేదు.
కంటెంట్ లేని సినిమాలు కనీసం బ్రేక్ ఈవెన్ ని కూడా సాధించలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఓ పక్క ఈ విషయం తెలిసి కూడా మన వాళ్లు వరుసగా భారీ చిత్రాలతో బాక్సాఫీస్ పై దాడికి రెడీ అవుతున్నారు. మరికొన్ని చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతుంటే మరి కొన్ని క్రేజీ కాంబినేషన్ లతో చిత్రీకరణ దశలో వున్నాయి. ఇప్పటికే కొన్ని షూటింగ్ మొదలయ్యాయి కూడా. ఇక ఇందులో భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' రిలీజ్ కాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు.
ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. భారీ క్రేజ్ కి తగ్గట్టే ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల బడ్జెట్ ని కేటాయించి నిర్మించారు. ఎంత బడ్జెట్ ఖర్చు చేసినా.. క్రేజీ కాంబినేషన్ లో సినిమా తీసినా కంటెంట్ కరెక్ట్ గా లేకుంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమన్నది పరస్తుతం వినిపిస్తున్న వాదన. ఇక ఇదే తరహాలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్' చిత్రానికి కూడా భారీ స్థాయిలోనే మేకర్స్ బడ్జెట్ ని కేటాయించారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అక్షరాలా 350 కోట్లు కేటాయించారు. ఇక ఇదే తరహాలో చరణ్ - శంకర్ ల కలయికలో సెట్స్ పై వున్న చిత్రానికి దిల్ రాజు కూడా 300 కోట్లు బడ్జెట్ ని కేటాయించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
శంకర్ తెరకెక్కించిన గత చిత్రం '2.O' కోసం భారీ స్థాయిలో బడ్జెట్ ని కేటాయించినా ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో చరణ్ - శంకర్ సినిమాకు 300 కోట్లు కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఇదే తరహాలో ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ కు కూడా 300 నుంచి 350 వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నారట. ఇక ఇదే బాటలో బన్నీ నటించబోతున్న 'పుష్ప 2' కోసం కూడా భారీ స్థాయిలోనే బడ్జెట్ ని పెడుతున్నారట. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 కు 350 కోట్ల వరకు వెచ్చించబోతున్నట్టుగా వార్తలు విస్తున్నాయి.
స్టార్ హీరోలు తమ చిత్రాలకు పోటా పోటీగా బడ్జెట్ లని పెంచేస్తుండటంతో క్రేజీ హీరోలు కూడా తమ చిత్రాల బడ్జెట్ లని పెంచేస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్' కోసం 125 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి 150 నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ ని ఫైనల్ చేశారట. ఇదే పంథాలో రాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ తో పాటు పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ 'జనగణమన', ప్రాజెక్ట్ కే వంటి చిత్రాలకు కళ్లెచెదిరే బడ్జెలని కేటాయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలకు కేటాయిస్తున్న బడ్జెట్ లు తిరిగి నిర్మాతలకు, సినిమాల్ని భారీ స్థాయిలో కోట్లు చెల్లించి సొంతం చేసుకునే డిస్ట్రీ బ్యూటర్ లకు భారీగా లాభాల్ని అందించాలంటే గ్రాండీయర్ తో పాటు కంటెంట్ వుండాల్సిందే. మరి ఆ విషయంలో మన మేకర్స్ జాగ్రత్తలు తీసుకుని వుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ వసూళ్ల వర్షంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు. అదే జరగక కంటెంట్ విషయంలో రాజీపడితే మాత్రం తీవ్ర నష్టాలు తప్పవు.