సంక్రాంతి బరిలో దిగుతున్న నాలుగు సినిమాలు..!

Update: 2020-12-30 17:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమాలకు బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతుంటాయి. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంటపురంలో' 'ఎంతమంచి వాడవురా' సినిమాలతో పాటు 'దర్బార్' అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కూడా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మరియు ఒక డబ్బింగ్ సినిమా బరిలో దిగుతున్నాయి. కరోనా నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి సినిమా పండుగ ఉండదని అనుకుంటున్న సమయంలో ఇప్పటికే థియేట్రికల్ రిలీజైన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో మేకర్స్ అందరూ ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన 'మాస్టర్' చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి ఈ సీజన్ లోనే విడుదల చేస్తున్నారు. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ కి తెలుగులో ఉన్న మార్కెట్ తో పాటు 'ఖైదీ' డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో యువ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2021 జనవరి 14న విడుదల చేయనున్నారు. రామ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. 'దేవదాస్' 'మస్కా' సినిమాల తర్వాత రామ్ నటించిన 'రెడ్' సినిమా సంక్రాంతి కి విడుదల అవుతుండటం గమనార్హం.

మాస్ మహారాజ్ ర్రవితేజ నటించిన 'క్రాక్' చిత్రాన్ని కూడా 2021 సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. జనవరి 14న 'రెడ్' సినిమాతో పోటీ ఎందుకులే అనుకుంటే 'క్రాక్' చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లుడు అదుర్స్' కూడా ఈ సీజన్ నే టార్గెట్ చేశారు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు పెద్ద సినిమాల మధ్య ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో నిలవనున్నాయి. మరి ఇందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
Tags:    

Similar News