మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మాలయాళ చిత్రం `లూసీఫర్` తెలుగులో `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు.. మెగా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో బిగ్ స్టార్స్ భాగస్వామం కాబోతున్నారు. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు బిజు మీనన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రజా గాయకుడు గద్దర్ మరో కీలక పాత్రను పోషించేందుకు బరిలో దిగారని సమాచారం.
ప్రజాయుద్ధనౌకగా పాపులరైన గదర్ ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటల్ని పాడారు. జానపదంలో ఆయన బాణి హృదయాల్ని హత్తుకుంటుంది. ఉద్యమం ఉద్వేగం ఆయన గొంతులో వినిపిస్తాయి. ఇకపోతే గాడ్ ఫాదర్ లో చిరంజీవి పాత్ర ఎమోషనల్ గా సాగుతుంది కాబట్టి గద్దర్ ని బిలో దించారు. ప్రస్తుతం గద్దర్ పైనా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆయన పాత్ర ఆద్యంతం ఎమోషనల్ గా.. ఆసక్తికరంగాను ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే హీరోపై వచ్చే ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ప్రజా గాయకుడు తనదైన శైలి గాత్రంతో ఓ ప్రత్యేక పాటను కూడా పాడుతున్నారు. ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. సాంగ్ ఆద్యంతం మెగాస్టార్ ఎలివేషన్స్ పతాక స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని తెరపై చూస్తారని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అనసూయ గాడ్ ఫాదర్ సిస్టర్ రోల్ పోషిస్తున్నారు. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు.
ఇలా తెరంతా మేటి ఆర్టిస్టులతో కలర్ ఫుల్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. సూపర్ గుడ్ ఫిలింస్.. ఎన్వీఆర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనంతరం `గాడ్ ఫాదర్` ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
2021-22 సీజన్ మెగాస్టార్ దే..!
మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` పూర్తి అవుతున్న క్రమంలోనే మెగాస్టార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంకర్`ని ప్రకటించారు. భోళా శంకర్ టైటిల్ కి తగ్గట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని అందిస్తారని సమాచారం. అలాగే మెహర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీకరణకు వెళ్లాల్సి ఉంటుందిట. కానీ దర్శకుడు బాబి తెరకెక్కించే సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. మెగా బాస్ ని పూర్తి మాస్ రోల్ లో చూపించేందుకు బాబి సిద్ధమవుతున్నారు. చిరు బర్త్ డే రోజున పోస్టర్ ని లాంచ్ చేయగా చక్కని స్పందన వచ్చింది. దీనికి వాల్తేరు వీరన్న లేదా వాల్తేరు శీను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని కథనాలొచ్చాయి. వైజాగ్ లోని మత్స్యకారుల నేపథ్యంలో మాస్ స్టోరీని బాబి ఎంపిక చేసుకున్నారని ఊహాగానాలు సాగిస్తున్నారు. వాల్తేర్ కి చెందిన వీరన్న కథను బాబి రాసారు. అయితే ఇప్పుడు వీరన్న టైటిల్ మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీరన్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చారని కథనొలొచ్చాయి. గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుంది.