రంగు పొంగు ఒడ్డు పొడుగు లేకపోతే మహిళలకు గౌరవం ఇవ్వరా? పెళ్లిళ్ల వెబ్ సైట్లో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత సంపాదించనట్టేనా? ఇదేమి కల్చర్? ఇంకా ఇంతగా వెనకబడి ఉన్నారేమిటి? అంటూ ఒక రేంజులోనే చెడామడా కడిగేసింది కింగ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్.
తనను నిత్యం సోషల్ మీడియాల్లో అనుసరిస్తూ కొంటె కామెంట్లు చేసే కుర్రాళ్లకు తిత్తి తీసింది. మరోసారి సౌండ్ లేకుండా చెవులు మెలి తిప్పేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జాత్యాహంకారం వర్ణాహంకారం వంటివి సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. మగువల రంగు పొంగు గురించిన కామెంట్లు గుసగుసలు వైరల్ చేసేయడం రివాజుగా మారింది. అన్నిటికీ కలిపి గంపగుత్తగా చీవాట్లు పెట్టేసింది సుహానా. అగ్లీ అని పిలిచేవారందరికి వ్యతిరేకంగా #కలరిజం అనే ట్యాగ్ ని వైరల్ చేశారు.
ఇక తనకు మద్ధతుగా నిలుస్తూ మగువల తరపున సుహానా మాతృమూర్తి గౌరీఖాన్ సుదీర్ఘ నోట్ ని పంపించారు. మమ్మీ గౌరీ తన ఇన్ స్టాగ్రామ్ లో తన చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోతో పాటు మహిళా సాధికారతపై ఆమె ఒక నోట్ రాశారు.
``మీరు నాలో కొంత భాగాన్ని మాత్రమే చూస్తారు. చూడాల్సినది ఎంతో ఉంది. కనిపించనివన్నీ నన్ను పూర్తిగా ఆవిష్కరిస్తాయి. అక్కడ నుండి నేను నా బలాన్ని పొందుతాను. ఈ చిత్రం #RootedToStrength లో ఉండేందుకు.. మీ ఆత్మను ప్రేరేపించే మహిళలను ట్యాగ్ చేయండి. ఈ వచనాన్ని భాగస్వామ్యం చేయండి ప్రపంచవ్యాప్తంగా బలపరచండి`` అంటూ గౌరీఖాన్ స్పందించారు.
ఆమె తన పోస్ట్ లో డిజైనర్ మోనిషా జైసింగ్ - కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ - అనన్య పాండే - భావన పాండే- నటి నీలం కొఠారి- సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ తదితరులను ట్యాగ్ చేశారు. 12 ఏళ్ల వయసు నుండే సుహానాకు కలరిజం విషయమై వేధింపులు ఎదురయ్యాయి. అగ్లీ.. కలర్ లెస్ అని దూషించేవారు. అందుకే సీన్ ఇంత సీరియస్ అయ్యింది. ఇక సుహానాకు అనన్య సహా దక్షిణాది నాయిక అనుపమ పరమేశ్వరన్ మద్ధతుగా నిలిచారు. ఈ తరహా క్రిటిసిజం సరికాదని నెటిజనులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
Full View