ఈ ఏడాది ఆరంభం లో మహేష్ బాబు హీరోగా అల్లు అరవింద్ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆమద్య నమ్రత మరియు అల్లు అరవింద్ ల మద్య చర్చలు కూడా జరిగాయని.. పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. సినిమా నిర్మాణంలో భాగస్వామి చేసి లాభాల్లో వాటాను మహేష్ బాబు కోరాడని.. అందుకు మహేష్ బాబు ఒప్పుకోలేదు అంటూ కూడా ప్రచారం జరిగింది. పరశురామ్.. మహేష్ బాబుల కాంబో మూవీని అల్లు అరవింద్ నిర్మించడం కన్ఫర్మ్ అనుకుంటే అది అటకెక్కింది.
ఇక మహేష్ బాబు మూవీ గీతా ఆర్ట్స్ లో ఉండక పోవచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయం లో అల్లు అరవింద్ కు నమ్మిన బంటు అయిన బన్నీ వాసు కీలక ప్రకటన చేశాడు. వాసు నిర్మించిన 'ప్రతిరోజు పండుగే' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా విడుదల సందర్బంగా ఒక మీడియా సంస్థకు నిర్మాత బన్నీ వాసు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.
గతంలోనే గీతా ఆర్ట్స్ లో మహేష్ బాబు సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కాని వచ్చే ఏడాదిలో కీలక ప్రకటన రాబోతుంది అంటూ బన్నీ వాసు ప్రకటించాడు. దర్శకుడు ఎవరు.. ఎప్పుడు ఉంటుందనే విషయం పై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ బాబు 27వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది. కనుక మహేష్ 28వ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉండే అవకాశం ఉందేమో చూడాలి. గీతా ఆర్ట్స్ లో ఇప్పటి వరకు మహేష్ మూవీ చేయలేదు. కనుక ఈ కాంబో వర్కౌట్ అయితే సంచలనమే అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.