సౌత్‌ ఓటీటీ మూవీకి గూగుల్‌ అరుదైన గుర్తింపు

Update: 2020-12-10 06:30 GMT
ఎన్నో విషాదాలను.. షాక్‌ లను మిగిల్చిన 2020 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం చివర్లో గూగుల్‌ తమ సెర్చ్‌ ఇంజిన్‌ లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాదిలో అత్యధికంగా ట్రెండ్‌ అయిన సినిమాల జాబితాను గూగుల్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో నెం.1 గా దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ నటించిన దిల్‌ బేచారా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయిన విషయం తెల్సిందే. సుశాంత్‌ మృతి చెందిన తర్వాత విడుదలైన సినిమా.. అతడి చివరి సినిమా అంటూ ప్రచారం చేయడం వల్ల భారీగా ట్రెండ్‌ అయ్యింది.

దిల్‌ బేచారా తర్వాత సౌత్‌ మూవీ 'సూరారై పోట్రూ' రెండవ స్థానంలో నిలిచింది. సూర్య హీరోగా సుధ కొంగర ద్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు కరోనా వల్ల థియేట్లు మూతబడి ఆగిపోయింది. కొన్ని నెలల పాటు ఈ సినిమా సోషల్‌ మీడియాలో.. నెట్‌ లో ట్రెండ్‌ అవుతూనే ఉంది. సినిమా విడుదల తర్వాత పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకోవడం వల్ల కూడా మళ్లీ ట్రెండ్డింగ్‌ కంటిన్యూ అయ్యింది. అందుకే బాలీవుడ్‌ సినిమాలను వెనక్కు నెట్టి మరీ సూర్య తన సినిమాతో రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో తన్హాజీ.. నాల్గవ స్తానంలో శకుంతలదేవి మరియు అయిదవ స్తానంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్‌ సక్సేనా నిలిచింది. తెలుగు సినిమాలకు ఈసారి పెద్దగా అవకాశం రాలేదు. సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలు మినహా ఇతర సినిమాలు ఏమీ కూడా ఈ ఏడాది రాలేదు. అది కూడా తెలుగు సినిమాలు జాబితాలో లేకపోవడంకు ఒక కారణం.
Tags:    

Similar News