హీరో మేకోవర్ ఓకె! మరి కంటెంట్?

Update: 2017-03-16 05:06 GMT
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గౌతమ్ నంద. ఈ చిత్రం కోసం మాస్ హీరో గోపీచంద్ చాలానే కసరత్తులు చేశాడనే విషయం అర్ధమవుతూనే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన లుక్ చూస్తే.. మేకోవర్ కోసం గోపీచంద్ ఏ స్థాయిలో కష్టపడ్డాడో తెలుస్తుంది.

క్లాస్ లుక్ లో మాస్ టచ్ ఇచ్చిన గోపీచంద్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్ ని ఫైనల్ చేయడానికి.. గోపీచంద్ చాలానే ప్రయత్నించాడట. ఇప్పుడీ సినిమా పూర్తికావచ్చింది. దుబాయ్ లో తెరకెక్కించనున్న ఇంట్రడక్షన్ సాంగ్.. మరొకపాటతో మొత్తం సినిమా పూర్తి కానుంది. అయితే.. ఇంత కష్టపడి ట్రాన్స్ ఫామేషన్ గోపీచంద్ చూపించినా.. సినిమాలో కంటెంట్ చాలా ముఖ్యం. కానీ దర్శకుడు సంపత్ నంది సహజంగా కొత్తగా చూపించాలనే ప్రయత్నాలు చేసిన రికార్డ్ లేదు.

మొదటి సినిమా మినహాయిస్తే.. ఆ తర్వాత చేసిన రచ్చ.. బెంగాల్ టైగర్ లలో అయితే మరీ రొటీన్ కమర్షియల్ ఫార్ములాలే. కాకపోతే.. టైమ్ అండ్ టైమింగ్ కూడా కలిసి రావడంతో.. ఈ రెండు సినిమాలు బాగానే ఆడేశాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేయడంలో సంపత్ నంది దిట్ట. మరిప్పుడు గౌతమ్ నంద మూవీలో.. గోపీచంద్ లుక్ మాత్రమే కొత్తగా ఉంటుందో.. సినిమా మొత్తం డిఫరెంట్ గా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News