తెలుగులో కొన్నేళ క్రితం స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియాన ఇక్కడ మంచి ఫామ్‌లో ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఈమె చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సౌత్ నుండి వెళ్లే ముందు చాలా నాజూకుగా - కనిపించి కనిపించని నడుముతో యూత్ ఆడియన్స్ ను అలరించిన ఇలియానా ఇప్పుడు బొద్దుగా తయారు అయ్యింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
తాజాగా ఈమెను యాక్షన్ హీరో గోపీ చంద్ తిరష్కరించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమద్య విశాల్ తో విభిన్నమైన చిత్రం ‘ఇంద్రుడు’ ను తెరకెక్కించిన దర్శకుడు తిరుతో గోపీచంద్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. చాలా విభిన్నమైన పాత్రను గోపీచంద్ తో తిరు చేయించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. గోపీచంద్ కు జోడీగా ఇలియానాను ఎంపిక చేయాలని దర్శకుడు తిరు భావించాడట. అదే విషయాన్ని గోపీచంద్ వద్ద ప్రస్థావించగా ఆమె వద్దని సున్నితంగా తిరష్కరించాడని టాక్ వినిపిస్తుంది.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఫలితంను బట్టి ఇలియానా కెరీర్ ఉండే అవకాశం ఉంది. కాస్త లావు అయినా కూడా రీ ఎంట్రీ మూవీ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆమె మళ్లీ తెలుగులో బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు. గోపీచంద్ ఆమెను తిరష్కరించిన విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా మరో రెండు రోజుల్లో వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ అయితే గోపీచంద్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.