ఎవరైనా ఏదైనా ఒక ప్రకటన చేస్తే దాని వెనక ఒకటి పాజిటివ్ కోణం.. రెండోది నెగెటివ్ కోణం ఇవి రెండూ ఉంటాయి. అయితే ఆ ప్రకటన చేసే ముందే ఆ రెండిటినీ బేరీజు వేసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ చేతన్ భగత్ లాంటి గొప్ప నవలా రచయిత ముందు వెనకా ఆలోచించకుండా అన్న ఓ మాట ప్రస్తుతం నెటిజనుల్లో కల్లోలం రేపుతోంది.
ఇంతకీ ఆయనేమన్నాడు? అంటే.. మధ్యతరగతి ప్రజలు రయా చక్రవర్తి గురించి.. సంచలనాత్మక గాసిప్ ల గురించి మాత్రమే బాధపడుతున్నారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ.. జిడిపి కుప్పకూలడం వగైరా ఇతర విషయాల గురించి కాదు. ఈ గుంపులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నవారే. లేదా వారి పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు. ఆయా సంస్థలు జీతాల కోతలను అమలు చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు కోల్పోయే ప్రశ్న కూడా లేనందున ఈ వ్యక్తులు గాసిప్ లను ఆస్వాదించడానికి ఇష్టపడతారు`` అంటూ పెద్ద బాంబే పేల్చాడు. భారతీయులు ఆర్థిక వ్యవస్థ లేదా దేశంలోని ఇతర సమస్యల గురించి శ్రద్ధ వహించాలని మీరు కోరుకుంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను తగ్గించండి అని చేతన్ భగత్ ట్వీట్ చేశారు.
దీనిపై ట్విట్టర్ లో నెటిజనం భగ్గుమన్నారు. ముఖ్యంగా చాలామంది ప్రభుత్వ రంగ వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు ఫ్రంట్ లైన్ లో కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు `# గార్బేజ్ చేతన్ భగత్` అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. చేతన్ భగత్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని.. తన తండ్రి సైన్యంలో ఉన్నందున ప్రభుత్వం నడుపుతున్న ఐఐటిల్లో చదివారని .. తల్లి వ్యవసాయ శాఖ ఉద్యోగి అని కొందరు వ్యాఖ్యానించారు. కాని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళ్లినప్పుడు భారత ప్రభుత్వానికి లేదా భారతీయ కంపెనీలకు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించిన వారు ఉన్నారు. మొత్తానికి ట్యాలెంటెడ్ నవలా రచయిత పెనుకంపనాలకు కారణమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అన్నట్టు.. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సరిగా వారి విధి నిర్వహణను చేయరనే చేతన్ భగత్ ఉద్ధేశమా? శంకర్ సినిమాల్లో ఇదేగా చూపించేది!! అక్కడ బొమ్మ బ్లాక్ బస్టరు.. ఇక్కడ డిజాస్టరా? ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సరిగ్గా కోవిడ్ 19 మహమ్మారీ టైమ్ లో ప్రభుత్వోద్యోగులు వారి విధి నిర్వాహణను సరిగా చేయాలని గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశాడు. వైద్యులు ఆ శాఖలోని వారు.. అలాగే పోలీసులు పని చేస్తే సరిపోదు.. అన్ని రంగాల్లోని వారు పని చేయాలి మరి! గాసిప్పులతో కాలక్షేపం చేయకుండా..!