స్టార్ కొడుక్కి గ్రాండ్ వెల్కమ్

Update: 2019-08-02 11:24 GMT
ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు మొదటి సినిమా షూటింగ్ పూర్తయ్యాక అది బాగా రాలేదని మళ్ళీ మొత్తం రీ షూట్ చేయడం బహుశా సినిమా చరిత్రలో విక్రమ్-ధృవ్ లకే జరిగిందేమో. అర్జున్ రెడ్డి రీమేక్ గా మొదట బాలా డైరెక్షన్ లో తీసిన వర్మ ఫైనల్ కట్ బాగా రాని కారణంగా మరోసారి సందీప్ వంగా శిష్యుడు గిరిసాయాతో ఆదిత్య వర్మగా పేరు మార్చి మళ్ళి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిది విడుదలకు రెడీ అయ్యింది. పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ కోసం నిర్మాతలు రెడీ అయ్యారు.

అందులో భాగంగా ధృవ్ ఇటీవలే చెన్నైలోని ఓ విమెన్ కాలేజీ కు ట్రైలర్ లాంచ్ కోసం వెళ్ళాడు. తన లుక్ పరంగా చాలా మార్పులు చేసుకోవడం చూసి ఆ కాలేజీ అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అంతేకాదు మనోడు స్పీచ్ తో అదరగొట్టడమే కాక పాటలు కూడా పాడేయడంతో తండ్రిని మించిన కొడుకు అనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు మెల్లగా ఆదిత్య వర్మ మీద కోలీవుడ్ లో అంచనాలు పెరుగుతున్నాయి బిజినెస్ కూడా బాగా జరుగుతోందని అక్కడి మీడియా రిపోర్ట్.

నిజానికి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ సునామి సృష్టించకపోతే ఆదిత్య వర్మను గత నెలే విడుదల చేసేవారు. కానీ పోలికలు వచ్చి ఇబ్బంది పెడతారన్న కారణంగా ఇది కొంచెం పెండింగ్ లో పెట్టారు. చియాన్ విక్రమ్ వారసుడిగా ఇతగాడి మీద అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. విక్రమ్ కూడా ఆదిత్య వర్మ పట్ల ధృవ్ పెర్ఫార్మన్స్ పట్ల హ్యాపీగా ఉన్నట్టు చెన్నై రిపోర్ట్. ఒకవేళ హిందీ తరహాలో ఇది కనక బ్లాక్ బస్టర్ అయ్యిందంటే ధృవ్ మొదటి సినిమాకే స్టార్ అయ్యేలా ఉన్నాడు. కాకపోతే సినిమా అక్కడివాళ్లకు కనెక్ట్ అవ్వాలి అంతే.

    

Tags:    

Similar News