కరోనా వల్ల మూతబడిపోయిన థియేటర్స్ మాల్టీప్లెక్సులు 50శాతం సీటింగ్ కెపాసిటీతో రీ ఓపెన్1చేసుకోడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఓటీటీకి రిలీజ్ ఇవ్వకుండా థియేటర్ల పర్మిషన్ కోసం వేచి చూసిన మేకర్స్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు కోవిడ్ తీవ్రత దృష్ట్యా 50 శాతం సీటింగ్ తో సినిమాలని విడుదల చేసారు. ఈ క్రమంలో రాబోయే సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కి పలు క్రేజీ మూవీస్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే 50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో నష్టాలు వచ్చే అవకాశం ఉందని.. ఆ పరిమితిని పునఃపరిశీలించి 100 శాతానికి పెంచితే బాగుంటుందని నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కోరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా అనేక వాయిదాల అనంతరం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ సినిమాకు థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని విజయ్ ఇటీవల తమిళనాడు సీఎంను కలిసి విన్నవించుకున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అక్కడ థియేటర్స్ - సినిమాస్ - మాల్టీప్లెక్సులు 100 శాతం సీటింగ్ కి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే థియేటర్స్ లో కోవిడ్ సేఫ్టీ మేజర్స్ స్ట్రిక్ట్ గా పాటించాలని సూచించింది.
కాగా, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం భౌతిక దూరం ఉండాలనే నిబంధనతో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇస్తే చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం అని కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. కోరోనా సెకండ్ వేవ్ వార్తలు వస్తున్న ఈ సమయంలో ఫుల్ ఆక్యుపెన్సీ పర్మిషన్ ఇస్తే అభిమానులను ఆపడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా వర్క్ ఔట్ అవుతుందో చూడాలి. మరోవైపు అన్నిటికి పూర్తిగా అనుమతులు ఇచ్చి థియేటర్స్ కి మాత్రమే అలాంటి కండిషన్స్ పెడితే జనాలు థియేటర్స్ కి రావడానికి సంకోచిస్తున్నారని.. తమిళనాడు నిర్ణయం స్వాగతించదగ్గదే అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ థియేటర్స్ కి 100 శాతం సీటింగ్ అనుమతులు ఇస్తారేమో చూడాలి.