అయ్యో 70 కోట్లు పెట్టేశానంటున్నాడే.. ఎక్కడ మునిగిపోతాడో అని బయటి జనాలకు కంగారుగా ఉంది కానీ.. గుణశేఖర్‌లో మాత్రం ఏం భయం లేనట్లుంది పరిస్థితి చూస్తుంటే. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో.. ఎలా హైప్ తీసుకురావాలో ఓ పక్కన బాహుబలి టీమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తోంది. సినిమా ఎంత ఆలస్యమైనా.. ఎన్నిసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడినా.. జనాల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది తప్పితే తగ్గట్లేదు. దీనికి జక్కన్న టీమ్ ఎంచుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీనే కారణం.
కానీ 'రుద్రమదేవి' సంగతి చూడండి. అప్పుడప్పుడూ ఓ ప్రెస్ నోట్ ఇవ్వడం.. ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం.. ఇదీ వరస. ఈ నెల 26న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వారం కిందట ప్రకటించాడు గుణ. కానీ ఆ తర్వాత సినిమా గురించి కబురే లేదు. అంత భారీ బడ్జెట్‌తో సినిమా తీశాక.. ప్రమోషన్ కార్యక్రమాలు చేసి సినిమా మీద హైప్ తీసుకురావాలన్న ఆలోచనే కనిపించట్లేదు అతడిలో. ఇలా అయితే ఏం ఓపెనింగ్స్ వస్తాయి.. ఎలా హాళ్లు నిండుతాయి. అసలే రెండు వారాల తర్వాత 'బాహుబలి' రెడీగా ఉంది. ఏం కొల్లగొట్టినా రెండు వారాల్లోనే కానిచ్చేయాలి. అలాంటపుడు ఓపెనింగ్స్ మీద దృష్టిపెట్టి సినిమాను ప్రమోట్ చేయాలన్న ధ్యాసే ఉన్నట్లు లేదు. ఈ సైలెన్స్ చూస్తుంటే సినిమాను మళ్లీ వాయిదా వేసేస్తాడా ఏంటో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే మాత్రం గుణశేఖర్‌ను ఎవ్వరూ కాపాడలేరు.