రుద్రమదేవి సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆ పాత్రలో అనుష్క కాకుండా మరొకరిని ఊహించుకోలేమో అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకు ఎందులో చూసినా రుద్రమదేవి పాత్రకు అనుష్కే పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. ఇంకే హీరోయిన్ కూడా ఆ పాత్ర పోషించి ఉంటే అంత ఠీవి ఉండేది కాదేమో అనిపిస్తోంది. ఐతే నిజానికి రుద్రమదేవి సినిమా తీయాలన్న ఆలోచన మొదలైనపుడు అనుష్కే హీరోయిన్ అని అనుకోలేదని చెప్పాడు గుణశేఖర్.
‘‘ఈ సినిమా తీయాలనుకున్నపుడు నాకు అనుష్క తట్టలేదు. స్నేహితులు, ఇండస్ట్రీ పెద్దల సలహాతో అనుష్కను రుద్రమదేవి పాత్ర కోసం ఎంచుకున్నా. ఒకరకంగా అరుంధతి సినిమా కూడా అందుకు ప్రేరణగా నిలిచింది. రుద్రమదేవి పాత్రకు అనుష్క వంద శాతం న్యాయం చేసింది. నిజంగా ఆమె సహకారమే లేకపోతే రుద్రమదేవి ఇంతబాగా తీయలేకపోయేవాణ్ని. నిజంగా అనుష్క లేకపోతే ఈ సినిమానే లేదు’’ అని చెప్పాడు గుణశేఖర్.
బాహుబలి ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది జానపద చిత్రం కాదని, చరిత్రలో నిజంగా జరిగిందే సినిమాలో చూపిస్తున్నానని గుణశేఖర్ చెప్పాడు. ‘‘ఇది చారిత్ర సినిమా. 13వ శతాబ్దం నాటి కాకతీయ చరిత్ర ఆధారంగా సినిమా తీశా. 850 ఏళ్ల కిందట జరిగిన కథని ఏమాత్రం వక్రీకరించకుండా పదేళ్ల పాటు పరిశోధన జరిపి సినిమా తీశాం. ఈ పరిశోధనలో ముదిగొండ శ్రీనివాస్, తోట ప్రసాద్, పరుచూరి బ్రదర్స్ సహకారమందించారు. సెట్స్ కోసమో, విజువల్ ఎఫెక్టుల కోసమో రుద్రమదేవి సినిమా తీయలేదు’’ అని గుణశేఖర్ చెప్పాడు.