'వకీల్ సాబ్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్ లో ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలు కమిట్ అవుతున్నారు. అంతే వేగంగా షూటింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాలను సెట్స్ మీద ఉన్నాయి. అందుకే 'భీమ్లా నాయక్' మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తిరిగి ప్రాభించనున్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ఇప్పటికే 45 శాతం పూర్తయింది. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న సినిమా ఇది. అంతేకాదు పవన్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ. దీని మీద పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ నేషనల్ వైడ్ క్రేజ్ కోసం ట్రై చేస్తున్న తరుణంలో పవన్ కూడా ''హరి హర వీరమల్లు'' చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకి తీసుకొచ్చాడు. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియాగా చేయాలని అనుకోవడం పెద్ద మిస్టేక్ అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ తెగ వినిపిస్తున్నాయి.
తెలుగు నేపథ్యం ఉన్న కథల్ని ఇతర భాషా జనాలకు బలవంతంగా చూపించినా.. పెద్దగా ఆదరించరని.. గతంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయంలో కూడా ఇదే అయిందని అంటున్నారు. తెలుగువాడైన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన తెచ్చుకోగా.. ఇతర భాషల్లో పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' సినిమాని మల్టీ లాంగ్వేజ్ లలో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.
ఇంతకముందు పవన్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని బహు భాషా చిత్రంగా విడుదల చేస్తే.. తీవ్ర నిరాశకు గురి చేసింది. అలానే పవన్ కళ్యాణ్ కు తెలుగులో ఉన్నంత క్రేజ్ మిగతా భాషల్లో ఇప్పుడు ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ముందు తెలుగులోనే విడుదల చేసి.. పరిస్థితుల్ని బట్టి మిగతా భాషల్లో రిలీజ్ చేయలన్నది మేకర్స్ లేటెస్ట్ ప్లాన్ అని టాక్ నడుస్తోంది.
'హరి హర వీరమల్లు' చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించునున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ తో ఈ విషయం కాస్త క్లారిటీ వచ్చింది. పవర్ స్టార్ గెటప్ - యాక్షన్ సీక్వెన్స్ లు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ - బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. 2022 సమ్మర్ లో హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.