హరీష్ శంకర్ 'వేదాంతం రాఘవయ్య' ఏమయ్యాడు..?

Update: 2021-11-18 07:05 GMT
దర్శకుడు హరీష్ శంకర్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. మాస్ ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న హరీష్.. ఇప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ లో హరీష్ మరికొన్ని కథలు సిద్ధం చేసి తన అసిస్టెంట్స్ తో డైరెక్ట్ చేయించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే హరీశ్ శంకర్ తన శిష్యుడు సి.చంద్రమోహన్ ను డైరెక్టర్ గా పరిచయం ''వేదాంతం రాఘవయ్య'' అనే సినిమాని అనౌన్స్ చేశారు. దీనికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ కథను అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

సునీల్ హీరోగా 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్ పై రామ్‌ ఆచంట - గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వెల్లడించారు. ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ ని అతిథిగా పిలిచి పూజా కార్యక్రమాలతో జనవరిలోనే షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

అయితే ఇప్పుడు 'వేదాంతం రాఘవయ్య' సినిమా చేతులు మారినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు వేరే ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతున్నారని.. అంతేకాదు హీరోగా సునీల్ ప్లేస్ లో సత్యదేవ్ వచ్చి చేరాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఏదేమైనా డైరెక్టర్ సుకుమార్ బాటలోనే హరీష్ శంకర్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. సుక్కూ ఓవైపు సినిమాలు డైరెక్ట్ చేస్తూనే.. మరో వైపు నిర్మాతగా మారి తన అసిస్టెంట్స్ ని దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

స్క్రిప్ట్ వైస్ కూడా తనవంతు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా తన శిష్యులను దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ గా మారడమే కాకుండా కథ కూడా అందిస్తున్నారు.


Tags:    

Similar News