పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ - సాగర్ చంద్రతో కలిసి భీమ్లా నాయక్ తో బంపర్ హిట్ కొట్టాడు. తదుపరి త్రివిక్రమ్ - సుజీత్ కాంబినేషన్ తో మరో రీమేక్ కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. అయితే అంతకుముందే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో `భవధీయుడు భగత్ సింగ్` అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఎట్టకేలకు ఈ సమ్మర్ లో సెట్స్ పైకి వెళుతోందని సమాచారం.
ఈరోజు హరీష్ శంకర్ `భీమ్లా నాయక్` సెట్స్ నుండి ఒక త్రోబ్యాక్ చిత్రాన్ని పంచుకున్నారు. దానికి “అబ్బాయిలు ఈ చిత్రాన్ని గుర్తుంచుకోండి. సమయం దొరికినప్పుడు ఈ ఉత్తేజకరమైన సంభాషణను పంచుకుంటాను” అని వ్యాఖ్యను జోడించారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు హరీష్ శంకర్ హ్యాపీ న్యూస్ చెప్పినట్లుగా కనిపిస్తోంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఎలా చూపిస్తాడో చూడాలి. పవన్ కోసం అతడు కాప్ స్టోరి రాసాడా? లేక ఇంకేదైనా సంథింగ్ రాసాడా? అన్నదానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
పాన్ ఇండియా ప్రయత్నమేనా?
ఇంతకుముందు కూడా హరీష్ శంకర్ తన ట్విటర్ ప్రొఫైల్ లో దీనికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అన్ని పనులు జరుగుతున్నాయని దర్శకుడు హరీష్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు. హరీష్ ట్విట్టర్ లో వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ``హాయ్ గైస్.. భవదీయుడు భగత్ సింగ్ అప్ డేట్ ల కోసం చాలా మంది నన్ను అడుగుతున్నారు. సినిమాలో టైమింగ్ తో పాటు.. సినిమా టైమింగ్ కూడా అంతే ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను మీతో పంచుకుంటాను. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి. మీ సహనం మద్దతు కి చాలా ధన్యవాదాలు`` అని అన్నారు.
అంతకంతకు ఆలస్యమవుతుండడం వల్లనే హరీష్ పై అభిమానుల ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఇలా వివరణ ఇచ్చాడని భావించారు. అలాగే పవన్ కోసం హరీష్ కూడా పాన్ ఇండియా కంటెంట్ రెడీ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వీరమల్లు గెటప్ ఛేంజ్
పవన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ హరి హర వీర మల్లుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని తెలిసింది. ఇది చాలా కాలం నుండి చిత్రీకరణ దశలో ఉంది. కోవిడ్ వల్ల షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ తన డేట్స్ కేటాయించారు. ఈ షెడ్యూల్ లోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను సాంతం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా. భారతదేశంలో ప్రవేశించిన బ్రిటీష్ వారి దోపిడీ నేపథ్యం.. కోహినూర్ వజ్రం.. నెమలి సింహాసనం దొంగతనం నేపథ్యంలో కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కంటెంట్ ఉంటుందని ఇంతకుముందు టాక్ వినిపించింది.
ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ స్నేహితుడు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.