ఫైనల్ గా డైరక్టర్ అవుతున్నాడు

Update: 2017-08-13 09:49 GMT
చాలామంది ఫిలిం ఇండస్ర్టీకి డైరక్టర్ అవ్వాలనో హీరో అవ్వాలనో వస్తారు. కాని ఆ ఛాన్సు వచ్చేవరకు అనేకానేక పనులు చేస్తుంటారు. అలా వచ్చిన వారిలో హర్షవర్దన్ కూడా ఒకడు. కాకపోతే అమృతం సీరియల్ లో హీరో అయిపోయి.. సినిమాలో కమెడియన్ అయిపోయి.. చాన్నాళ్ళు అలా గడిపేశాడు. తరువాత రైటర్ గా ఇష్క్.. గుండె జారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు చాలామంచి మాటలే అందించాడు. ఇప్పుడు ఎట్టకేలకు డైరక్టర్ అవుతున్నాడు.

తొలిసారిగా డైరక్షన్ పగ్గాలు చేపబడుతూ.. ''గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాతో వస్తున్నాడు. అయితే మనోడి విషయంలో ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే.. ఇది1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌కథే అంటూ అర్ధమవుతోంది కాని.. ఈ సినిమాకు మనోడు 'ఏ హర్హవర్దన్స్ మ్యూజికల్ నెరెటివ్' అన్నాడు. అదేంటబ్బా అని ఆరాతీస్తే.. అసలు మనోడు మ్యూజిక్ డైరక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాడట. అందుకే వేరే టెక్నీషియన్ సహాయంతో ఈ సినిమాకు తనే మ్యూజిక్ చేసేశాడట. అందుకే ఇది తన మ్యూజికల్ నెరేటివ్ అంటున్నాడు.

మొత్తానికి బాలీవుడ్ లో విశాల్ భరద్వాజ్ తరహాలో.. ఇక్కడ హర్షవర్దన్ కూడా మాటలు-పాటలు-కథ-స్ర్కీన్ ప్లే-సంగీతం-డైరక్షన్ అంటూ బాగానే ఆకట్టుకుంటున్నాడు. దీనికితోడుగా ఒక్క సక్సెస్ పడిందంటే ఫేట్ మారిపోతుందంతే.
Tags:    

Similar News