14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆగమం గురించి తెలిసిందే. ఏటీవీ అనీల్ సుంకరతో కలిసి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఏర్పాటు చేసిన బ్యానర్ ఇది. ఈ సంస్థలో మహేష్ హీరోగా దూకుడు, ఆగడు చిత్రాల్ని నిర్మించారు. అయితే దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఆగడు మాత్రం డిజాస్టర్ రిజల్టుని అందించింది. మహేష్ హీరోగా `1 నేనొక్కడినే` వంటి భారీ చిత్రాన్ని నిర్మించారు ఈ బ్యానర్ లో. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో సదరు సంస్థ స్పీడ్ తగ్గించింది. ఇటీవల చిన్న సినిమాలపైనా దృష్టి సారించిన ఈ సంస్థ మునుముందు అగ్ర హీరోలతో భారీ చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందట. మహేష్ తో పాటు ఇతర పెద్ద స్టార్లతోనూ సినిమాలు చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థ మహేష్ తో సినిమా కోసం తహతహలాడుతోంది. తమ సంస్థకు కథలు అందించిన అనీల్ రావిపూడి(ఆగడు రచయిత)తో ఇప్పటికే కథను వండిస్తోంది. ఇటీవలే `ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అనీల్ రావిపూడికి ప్రస్తుతం మహేష్ ఆఫర్ ఇచ్చారని ప్రచారమవుతోంది. అనీల్ రావిపూడి- 14 రీల్స్ సినిమాకి మహేష్ ఓకే చెప్పాడని.. మహర్షి తర్వాత సెట్స్ పైకి వెళ్లబోయేది ఈ సినిమానే అని ప్రచారం సాగుతోంది. సుకుమార్ తో చేయాల్సినది అనీల్ రావిపూడికి షిఫ్టయిపోయింది అంటూ తెలుగు మీడియాలో కథనాలు వండి వార్చడం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఆసక్తికరంగా ఈ ట్విస్టులకు మరో అదనపు ట్విస్టు యాడైంది తాజాగా. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న `మహర్షి` పూర్తయ్యాక మరో సినిమాలో నటించాల్సిందిగా దిల్ రాజు ఓ ప్రపోజల్ ని పెట్టారట. ఆ రకంగా 14 రీల్స్ దూకుడుకి రాజుగారు చెక్ పెడుతున్నారని, అలాగే మహేష్ ని `మహర్షి` తర్వాతా లాక్ చేసే ప్లాన్ వర్కవుటయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. కథ ఎవరు బాగా చెబితే వాళ్లకే ఛాన్సిచ్చే మహేష్ దిల్ రాజు రెడీ చేయించే స్క్రిప్టుకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాటా వినిపిస్తోంది. `మహర్షి` జయాపజయాలు మహేష్ ఆలోచనల్ని మార్చే వీలుంటుంది. ఇక మహేష్ ఓ సినిమాకి కమిటవ్వాలంటే బౌండ్ స్క్రిప్టు తప్పనిసరి. ఆ పని చేయించడంలో దిల్ రాజు తర్వాతనే ఎవరైనా. అందుకే ఆయన ఏ సన్నివేశాన్ని అయినా తనకు అనువుగా మార్చుకునే నిపుణుడిగానూ పేరు బడ్డారు. మరి మునుముందు సన్నివేశం ఎలా ఛేంజ్ అవుతుందో చూడాలి. మహర్షి చిత్రాన్ని పీవీపీ- అశ్వనిదత్ వంటి దిగ్గజాల్ని కలుపుకుని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిట్ చేసే బాధ్యతను దిల్ రాజు భుజాన వేసుకున్నారు.